రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోప్, ఆసియా సహా గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. చివరి సెషన్‌లో అమెరికా డౌజోన్స్ 0.53 శాతం, నాస్‌డాక్ 1.66 శాతం, ఎస్ అండ్ పీ 0.79 శాతం నష్టపోయాయి. భారత్ సహా ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తగ్గకపోవడంతో ఈ వారం కూడా మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోను అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు అంచనాలకు మించి పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి పైన కూడా ఇన్వెస్ట్ చేయడం పెరుగుతుంది. పసిడికి డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతాయి.

వామ్మో చమురు ధరలు
చమురు ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం ఏమాత్రం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 130 డాలర్లను తాకాయి. బ్రెంట్ క్రూడ్ (మే 22 ఫ్యూచర్) ఈ వార్త రాసే సమయానికి 11.66 డాలర్లు లేదా 9.88 శాతం ఎగిసి 129.69 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 9.90 డాలర్లు లేదా 8.56 శాతం లాభపడి 125.58 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ పరిస్థితి ఇలాగే ఉంటే క్రూడ్ ధరలు 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నాలుగు నెలల క్రితం 70 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్, ఈ కొద్ది కాలంలోనే దాదాపు రెట్టింపు అయింది.

స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ఉంటున్నాయి. చమురు ధరలు పెరగడంతో అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు పెరిగాయి. దేశీయంగా ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు అధికమవుతుందని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఒత్తిడిని పెంచాయి. దేశీయంగా ఫిబ్రవరి తయారీ పీఎంఐ 54.9కి, సర్వీస్ పీఎంఐ 51.8 పాయింట్లకు మెరుగు పడింది. జీఎస్టీ వసూళ్లు కూడా రికార్డ్ స్థాయిని కొనసాగిస్తున్నాయి. ఎగుమతులు 22 శాతం పెరిగాయి. అయితే ఉత్పత్తిని పెంచకూడదని ఒపెక్ దేశాలు నిర్ణయించినందున ఆ ప్రభావం చమురు ధరలపై పడుతోంది. డాలర్ మారకంతో రూపాయి 75.3 నుండి 76.2కు క్షీణించింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంపు 25 శాతం ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పరిణామాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మార్కెట్ తీవ్ర ఊగిసలాట, నష్టాల్లోనే ఉండవచ్చు.
సెన్సెక్స్ ఈ వారం 53,500 దిగువకు వస్తే 52,000 స్థాయికి పడిపోవచ్చునని, అలాగే రికవరీ ఉంటే 55,000 క్రాస్ చేస్తే 56,300 దాటవచ్చునని మార్కెట్ వర్గాల అంచనా.
నిఫ్టీ 16,000 పాయింట్ల దిగువకు వస్తే మరింత క్షీణించవచ్చునని, సానుకూలంగా ఉంటే 16,600కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

బంగారం ధరలు
బంగారం ధరలు గత వారం రూ.52,500 క్రాస్ చేశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అననుకూల పరిస్థితి ఉంటే పసిడి ధరలు రూ.53,000 క్రాస్ చేసి, ఈ వారం 54,000కు చేరుకున్నా ఆశ్చర్యం లేదని, పరిస్థితి సానుకూలంగా ఉంటే మాత్రం భారీ కరెక్షన్ కనిపించి రూ.50,500 దిగువకు రావొచ్చునని చెబుతున్నారు. వెండి ధరల జోరు కొనసాగితే రూ.71,000, దిద్దుబాటుకు గురైతే 66,000 దిగువకు పడిపోవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications