ఈ వారం మార్కెట్లు ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు పెరుగుతాయా?
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా నష్టాల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బులియన్ మార్కెట్ కాస్త పుంజుకోవచ్చు. గతవారం ఆరంభంలో యుద్ధ ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా కఠిన ఆంక్షలు వంటి అంశాలతో రష్యా తగ్గుతుందనే అభిప్రాయంతో మార్కెట్ నష్టాలు తగ్గాయి. కానీ ఇప్పుడు రష్యాకు స్విఫ్ట్ తొలగింపు ప్రభావంతో మార్కెట్లు మళ్లీ పతనమవుతున్నాయి. అదే సమయంలో రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధమైంది. ఈ అంశాలు మార్కెట్లపై ఈ వారం ప్రభావం చూపుతాయి.

ఈ ప్రభావం
ప్రస్తుతం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, చర్చల అనంతరం సానుకూలంగా ఉంటే లాభాల్లోకి రావొచ్చునని భావిస్తున్నారు. నిఫ్టీ 16900 నుండి 17000 పాయింట్ల వద్ద నిరోధకం, 15900 పాయింట్ల నుండి 16000 పాయింట్ల మధ్య మద్దతు కనిపిస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుత దిద్దుబాటును అవకాశంగా ఉపయోగించుకోవచ్చునని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో పాటు వాహన విక్రయాలు, జీడీపీ గణాంకాలు, ఐహెచ్ఎస్ మార్కిట్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

మద్దతు, నిరోధకం
సెన్సెక్స్ మద్దతు 54,400, 53,300 పాయింట్లు, నిరోధకం 56,600, 57,200 వద్ద కనిపిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 53,000 దిగువకు కూడా పడిపోవచ్చునని, సానుకూలంగా ఉంటే మాత్రం 58,000ను క్రాస్ చేయవచ్చునని చెబుతున్నారు. నిఫ్టీ మద్దతు 16,500 పాయింట్లు, నిరోధకం 16,900కు పైన కనిపిస్తోంది.

బంగారం ధరలు
ఈవారం పసిడిపై ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ ప్రభావం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటే ధరలు తగ్గే అవకాశముంది. ఇలాగే కొనసాగితే మాత్రం మరింతగా పెరగవచ్చు. ఉద్రిక్తతలు కొనసాగితే గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్ రూ.50,700కు చేరుకోవచ్చునని, అప్పుడు అమెరికా వడ్డీ రేటు ప్రభావం కూడా అంతగా ఉండదని చెబుతున్నారు.
పసిడికి రూ.50,000 వద్ద మద్దతు కనిపిస్తోందని, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఈ స్థాయిని అధిగమిస్తే రూ.48,500 దిగువకు వెళ్లవచ్చునని, అననుకూలంగా ఉంటే రూ.53,000కు కూడా చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications