స్టాక్ మార్కెట్లో ఈ వారం లాభాల స్వీకరణ కనిపించవచ్చు. బంగారం ధరలు ఈ వారం కాస్త క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధభయాలకు కరోనా ఆందోళనలు తోడు కానున్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రభావం చూపనున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్ పైన ఉంటుంది. FIIల పెట్టుబడులు వస్తే మార్కెట్ లాభాల్లోకి రావొచ్చు. సిమెంట్, బ్యాంకు షేర్లు సానుకూలంగా కదలాడవచ్చు.

మార్కెట్ పైన వీటి ప్రభావం
ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధ పరిణామాలకు తోడు చైనా-దక్షిణ కొరియా దేశాలలో కరోనా కొత్త కేసుల పెరుగుదల, ముడిచమురు ధరలు ఈ వారం మార్కెట్ల పైన ప్రభావం చూడవచ్చు. ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగితే నిఫ్టీ 17500 పాయింట్ల దిశగా వెళ్లవచ్చునని చెబుతున్నారు.
ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ ఉంటే ఇక్కడ కూడా అదే ధోరణి ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల పెట్టుబడులకు మొగ్గు చూపితే మూలాలు బలంగా ఉండి, స్థిరమైన ధరలు కొనసాగుతున్న షేర్ల వైపు చూడాలని అంటున్నారు.

మద్దతు, నిరోధకం
సెన్సెక్స్ గతవారం 57,863 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,272 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ మద్దతు స్థాయి 57,520 వద్ద, నిరోధకం 58,500 వద్ద కనిపిస్తోంది. 59,000 క్రాస్ చేస్తే 59,600 కూడా క్రాస్ చేయవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. నిఫ్టీ నిరోధకం 17,400, మద్దతు 16,900 వద్ద కనిపిస్తోంది.

బంగారం, వెండి ధరలు
గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.52,500 వద్ద నిరోధకం ఎదురు కావొచ్చునని, ఈ స్థాయిని అధిగమిస్తే మాత్రం రూ.53,500 క్రాస్ చేయవచ్చునని చెబుతున్నారు. క్షీణిస్తే మాత్రం రూ.51,000 దిగువకు పడిపోవచ్చునని, 50,500 దికువకు వస్తే మరింత క్షీణించే అవకాశముందని చెబుతున్నారు. సిల్వర్ మే కాంట్రాక్ట్ రూ.66,600 వద్ద దిద్దుబాటుకు గురి కావొచ్చు.


Click it and Unblock the Notifications