మార్కెట్లు ఈ వారం కాస్త సానుకూలంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేటు నిర్ణయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కీలకం కానున్నాయి. దేశీయంగా చూస్తే ఫిబ్రవరి ద్రవ్యోల్భణ గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతాయి. ఇక, పసిడి ధరలు దాదాపు స్థిరంగా కొనసాగవచ్చునని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ ఉంటుందని, పెరిగితే మాత్రం మరింత భారీ కరెక్షన్‌కు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

రక్షణాత్మక రంగాల వైపు చూపు
ఈ వారం సిమెంట్ కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడవచ్చు. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా ఉండటం, అంచనాల కంటే తక్కువ డిమాండ్, బలహీన ధరల అంచనాల కారణంగా గత కొద్ది సెషన్లుగా ఇవి తగ్గాయి. దీంతో వీటిలో రికవరీ కనిపించవచ్చు.
వాహన కంపెనీల షేర్లు దాదాపు స్థిరంగా కొనసాగవచ్చు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల వైపు చూడవచ్చు.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఈ రంగాల స్టాక్స్ సానుకూలంగా ఉండవచ్చు. ఇప్పటికే ఎఫ్ఐఐలు విక్రయాలు చేపట్టడంతో బ్యాంకింగ్ షేర్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూడవచ్చు. ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగవచ్చు.నిఫ్టీ గతవారం 16,630 వద్ద ముగిసింది. సానుకూలంగా ఉంటే 17,000 పాయింట్లు దాటే అవకాశాలు లేకపోలేదని, కానీ ప్రతికూలంగా ఉంటే మాత్రం 16,200 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయి.
సెన్సెక్స్ క్రితం వారం 55,550 వద్ద ముగిసింది. ఈ వారం సానుకూలంగా ఉంటే 57,800 స్థాయికి, ప్రతికూలంగా ఉంటే 52,000 స్థాయికి పడిపోవచ్చునని భావిస్తున్నారు. ఈ వారం 54,000 నుండి 58,000 మధ్య కదలాడవచ్చు.

బంగారం ధరలు
గోల్డ్ ఫ్యూచర్ ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం రూ.51,600 దిగువకు వస్తే రూ.50,000 స్థాయికి కూడా పడిపోవచ్చునని, రూ.55,000 స్థాయిని అధిగమిస్తే మాత్రం రూ.56,500 స్థాయికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. వెండి ధరలు కూడా ప్రతికూలంగా ఉంటే రూ.72,650కి, అనుకూలంగా ఉంటే రూ.68,000కు దిగి రావొచ్చు.


Click it and Unblock the Notifications