అంతర్జాతీయ మార్కెట్లు ఈవారం సానుకూలంగా కదలాడవచ్చునని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్ పైన ఉంటుంది. ఎస్ అండ్ పీ ఈ ఏడాది చివరి నాటికి 5100 పాయింట్లకు చేరుకోవచ్చునని, అంటే ప్రస్తుతం ఉన్న 4500 పాయింట్ల నుండి ఇది 13 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చునని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎస్ అండ్ పీ 4114 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ సమయంలో అమెరికా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 25 శాతం వరకు రిటర్న్స్ వచ్చి ఉంటాయి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కనిపిస్తున్నందున యూఎస్ సూచీలు ఈ వారం కూడా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆసియా, భారత్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది.

మార్కెట్ సానుకూలత ఎందుకంటే
చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణిగే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, భారత్ పరంగా చూస్తే దేశీయంగా కరెంట్ ఖాతా లోటు మూడో త్రైమాసికంలో 23 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది జీడీపీలో 2.7 శాతం. మార్చిలో జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి కాస్త బలపడింది. గతవారం 76.2 వద్ద ప్రారంభమై, 75.8కి బలపడింది. మరోవైపు రష్యా నుండి భారత్ చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇంకోవైపు అమెరికా తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేస్తామని ప్రకటించడంతో చమురు ధరలు పడిపోయాయి. విదేశీ సంస్థగత ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. 2021 అక్టోబర్ నుండి 2022 మార్చి వరకు ఆరు నెలల్లో రూ.1.48 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. కానీ గతవారం సానుకూలంగా ఉంది. ఇవి స్టాక్ మార్కెట్‌కు సానుకూల అంశాలు.
ఇక, చైనాలో కరోనా లాక్ డౌన్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల పైన తక్కువగా ఉండే అవకాశముంది. ఇప్పటికే అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఫెడ్ వడ్డీ రేటుపై దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకోవడం అమెరికా మార్కెట్ పైన, తద్వార అంతర్జాతీయ మార్కెట్ పైన మిశ్రమ ప్రభావం చూపుతుంది.

సెన్సెక్స్ ముందుకు
గతవారం సెన్సెక్స్ భారీగా లాభపడింది. గతవారం సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లు లాభపడింది. చివరి సెషన్‌లోనే 700 పాయింట్లకు పైగా ఎగిసి 59,276 పాయింట్ల వద్ద ముగిసింది. చాలా రోజులకు 59,000 పాయింట్లను దాటింది. నిఫ్టీ కూడా 17,700కు సమీపంలో ముగిసింది. సెన్సెక్స్ గతవారం 58,400 నుండి 59,100 పాయింట్ల మధ్య చురుగ్గా కదలాడింది. ఈ వారం 60,000 మార్కు దాటి, 61,000 పాయింట్ల దిశగా పరుగు పెట్టవచ్చునని భావిస్తున్నారు. 58,400 వద్ద మద్దతు, 57,400 వద్ద నిరోధకం కనిపిస్తోందని చెబుతున్నారు. నిఫ్టీ 18,000 పాయింట్లు దాటవచ్చు.

బంగారం ధరలు
బంగారం ధరలు గతవారం క్షీణించాయి. చివరి సెషన్లో రూ.310 తగ్గి రూ.51,275 వద్ద ముగిసింది. వెండి కూడా ఇటీవలి గరిష్టం 72,000 స్థాయి నుండి రూ.67,000 దిగువకు పడిపోయింది. బంగారం ఈ వారం రూ.51,000 దిగువకు పడిపోవచ్చునని, కానీ 52,000 క్రాస్ చేస్తే మాత్రం రూ.52,750 దిశగా వెళ్లవచ్చునని అంటున్నారు. వెండి రూ.65,000 స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని, ముందుకు వెళ్తే మాత్రం తిరిగి రూ.68,500 వద్దకు చేరుకోవచ్చునని అంటున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications