కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల భారత్ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా ఎవరికివారు ఇళ్లకు పరిమితం కావాల్సి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వాలకు కూడా వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంకులు కూడా తమదైన సహకారం చేసేందుకు ముందుకు వచ్చాయి.

ముందుకొచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకులు
కరోనా దెబ్బకు రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయారు. లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం వచ్చింది. బ్యాంకుల్లో లోన్ తీసుకొని వ్యాపారాలు చేసుకొని, ఇళ్లు, వాహనాలు కొనుక్కున్నవారు నెలనెలా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి. అయితే ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించి ఊరట కల్పించింది. చిన్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లను కష్టసమయంలో ఆదుకొనేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకొచ్చాయి.

ఈ బ్యాంకులన్నీ రుణాలిచ్చేందుకు సిద్ధం
కస్టమర్లకు ప్రత్యేక అత్యవసర లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులు ప్రకటించాయి. దేశంలో బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా ఎనభై శాతం వరకు ఉంది. ఇలా కస్టమర్లను కాపాడుకున్నట్లుగా కూడా అవుతుందని భావిస్తున్నాయి.

క్లిష్ట పరిస్థితుల్లో అండగా..
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే తమ కస్టమర్లకు అండగా నిలవాలని నిర్ణయించామని, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తగ్గించటంలో భాగంగా ద్రవ్యకొరత లేకుండా తమ వంతుగా సహకరిస్తామని, దీంతో వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారులకు తమ వ్యాపారంలో కష్టాలు తీరుతాయని బ్యాంకులు చెబుతున్నాయి.

కోవిడ్ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్
కోవిడ్ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా తమ కస్టమర్లకు అదనపు రుణాలు అందించనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణాలు కావాల్సిన తమ కస్టమర్లకు ఎమర్జెన్సీ లోన్లు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. తమ కస్టమర్లయిన MSMEలకు ప్రత్యేక అత్యవసర రుణ విధానం ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.

కోవిడ్ లైన్ ఆఫ్ సపోర్ట్ స్కీం
ద్రవ్య సరఫరాకు అంతరాయం రాకుండా చూసేందుకు సూక్ష్మ చిన్నతరహా, కార్పొరేట్, వ్యవసాయ, చిల్లర వ్యాపారస్తులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తామని కెనరా బ్యాంకు తెలిపింది. కోవిడ్ 19 లైన్ ఆఫ్ సపోర్ట్ స్కీం పేరుతో చిన్నతరహా పరిశ్రమలకు ప్రత్యేక లోన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలిపింది.

ఇండియన్ బ్యాంకు రుణ పథకాలు
ఇండియన్ బ్యాంకు అంతకుముందు ఐదు రకాల ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు కుదుటపడ్డ తర్వాత వాయిదాలు చెల్లించే విధంగా దీర్ఘకాలిక వ్యవధికి అందిస్తోంది. నిర్వహణ మూలధనంలో 10 శాతం వరకు, గరిష్టంగా రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తోంది. మొదటి 6 నెలలు మారటోరియం ఉంటుందని, 36 నెలల్లోగా రుణం తీర్చే అవకాశముంటుంది.

యూనియన్ బ్యాంకు ఇలా..
యూనియన్ బ్యాంకు మూలధనంలో గరిష్టంగా 10 శాతం వరకు ఇస్తోంది. సెప్టెంబర్ 30 వరకు ఈ రుణాలు అందిస్తుంది. మొదటి ఏడాది మారటోరియం ఉంటుంది. ఆ తర్వాత 36 నెలల్లో వీటిని తీర్చేయాలి. ఎంఎస్ఎంఈలు గరిష్టంగా రూ.10 కోట్లు, కార్పోరేట్లకు రూ.50 కోట్ల వరకు రుణం ఇస్తుంది.

కెనరా బ్యాంకు రుణం...
కెనరా బ్యాంకు ఎంస్ఎంఈలు, కార్పోరేట్లు, వ్యాపార సంస్థలు, రిటైల్ రుణదాతల కోసం కెనరా క్రెడిట్ సపోర్ట్ కోవిడ్ 19 పేరుతో రుణాలు అందిస్తుంది. మూలధన నిర్వహణలో 10 శాతం నుండి 35 శాతం వరకు ఇస్తుంది. జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి ఈ రుణాలు. ఆంధ్రా బ్యాంకు, PNB, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కూడా ప్రత్యేక రుణ పథకాలు అమలు చేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications