MS Dhoni on Trading: గ్రౌండులో ఆగటాళ్లను కంట్రోల్ లో పెట్టే కెప్టెన్ కూల్ మహీంద్ర సింగ్ ధోనీ తాజాగా స్టాక్ మార్కెట్లలో ఆప్షన్ ట్రేడింగ్ గురించి స్పందించారు. స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళితే బౌల్డ్ అవటం తప్పదని హెచ్చరించారు. చాలా మంది యువత నేటి కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ భారీ రిస్క్ తీసుకోవటంపై సెబీ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రేడర్లు నష్టాలను చూస్తున్నట్లు ఇటీవల విడుదలైన గణాంకాలు సైతం బయటపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవాలను గుర్తించకుండా చాలా మంది ఇప్పటికే గుడ్డిగా స్టాక్ మార్కెట్లలో భారీగా డబ్బు సంపాందిచొచ్చనే ఆలోచనలతో అప్పులు చేసిమరీ పెట్టుబడులు పెట్టడం, ఇంట్రాడే ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్ వంటి వాటికి పాల్పడుతున్నారు. ఈ సమయంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక ఇంటర్వ్యూలో యువతను F&O ట్రేడింగ్‌కి దూరంగా ఉండాలని సూచించారు.

యువత తమ జీవితంలో తీసుకోవాల్సిన అనేక రిస్క్‌లు ఉన్నాయని, అయితే భరించలేని ప్రమాదాలకు దూరంగా ఉండాలంటూ ధోనీ హెచ్చరించారు. మార్కెట్లలో వృత్తిపరమైన వ్యాపారులందరూ ట్రేడింగ్ చేస్తున్నారని కెప్టెన్ కూల్ పేర్కొన్నారు. కానీ యువకులు దయచేసి F&O ట్రేడింగ్ లోకి ప్రవేశించవద్దని ధోనీ సూచించారు. దానిలో కూరుకుపోతే నష్టాల నుంచి బయటకు తిరిగి రావటం చాలా కష్టమని పేర్కొన్నారు. యువత థ్రిల్ కావాలనుకుంటే వేరే ఏదైనా చేయాలని, ఈ ట్రేడింగ్ వ్యసనానికి మాత్రం దూరంగా ఉండాలని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిని యువత కోసం కాదని, నిపుణులు నిర్వహించటానికి రూపొందించబడిందని అన్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు సెబీ అందించిన గణాంకాలను పరిశీలిస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ప్రతి 100 మందిలో 90 మంది నష్టాలను చవిచూస్తున్నట్లు వెల్లడైంది. అంటే కేవలం 10 శాతం మంది మిగిలిన 90 శాతం మంది డబ్బును తుంటున్నారని మిత్రులారా అందరూ దీనికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొనుగోలు చేయాలంటూ ప్రేరేపించే నిపుణులపై విరుచుకుపడ్డారు. షేర్లను కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టడం సరైనదే అయినప్పటికీ రూ.5000 బెట్ వేస్తాం ఏమౌతుందో చూద్దాం అంటూ డెరివేటివ్స్ ట్రేడింగ్ జోలికి మాత్రం పోవద్దని ధోనీ సూచించారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications