మహీంద్రా అదిరిపోయే ఆఫర్లు, రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్

ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కంపెనీ వాహన కొనుగోలుదారులకు బంపరాఫర్ ప్రకటించింది. తన BS6 ఎస్‌యూవీలపై ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తోంది. ఈ వాహనాలపై రూ.3.06 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ఇస్తోంది. కేవలం ఒక సరికొత్త థార్‌కు మాత్రం ఆఫర్లు ఇవ్వడం లేదు. అయితే ఈ ఆఫర్లు కూడా మరికొద్ది రోజులే. ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు వస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ ఉంది. ఇతర ఆఫర్లు కూడా ఉంటాయి.

రూ.3.06 లక్షల వరకు బెనిఫిట్స్

రూ.3.06 లక్షల వరకు బెనిఫిట్స్

మహీంద్రా అండ్ మహీంద్రా అధికారిక వెబ్ సైట్ ప్రకారం బొలెరో పైన రూ.20,050 నుండి ఆల్టురాస్ జీ4 పైన రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఫిబ్రవరి 28, 2021 వరకు ఉండే ఈ ఆఫర్లు ఆయా ప్రాంతాల్లో

డీలర్‌షిప్‌ను బట్టి వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉంటాయి. మహీంద్రా ఆల్టురాస్ ఎస్‌యూవీపై రూ.3.06 లక్షల తగ్గింపు అందుతుంది. ఇందులో రూ.2.2 లక్షల వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50వేలు, కార్పోరేట్ డిస్కౌంట్ కింద రూ.16వేల నుండి రూ.20వేల వరకు ఉంది.

మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.44వేల వరకు డిస్కౌంట్ ఉంది. క్యాష్ ఆఫర్ కింద రూ.10,000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25,000, రూ.5వేల కార్పోరేట్ డిస్కౌంట్ ఉంది.

వీటిపై రూ.80వేల వరకు

వీటిపై రూ.80వేల వరకు

మహీంద్రా KUV100 NXT పైన రూ.38,055 వరకు ప్రయోజనం ఉంది. రూ.20,000 వరకు బోనస్, రూ.4000 కార్పోరేట్ డిస్కౌంట్ ఉంది. కస్టమర్లకు మొత్తంగా రూ.62,055 వరకు ప్రయోజనం ఉంది.

మహీంద్రా స్కార్పియోపై రూ.39,502 వరకు ప్రయోజనం ఉంది. రూ.10,000 వరకు క్యాష్ బోనస్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.15000, కార్పోరేట్ ఆఫర్ రూ.4500, అడిషనల్ బెనిఫిట్ రూ.10,000 వరకు ఉంది.

మహీంద్రా XUV500 పైన గరిష్టంగా రూ.80,800 వరకు ఆఫర్ ఉంది. క్యాష్ డిస్కౌంట్ రూ.36,800, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20,000, కార్పోరేట్ డిస్కౌంట్ రూ.9000, అడిషనల్ ఆఫర్ రూ.15000 వరకు ఉంది.

మరిన్ని ఆఫర్లు

మరిన్ని ఆఫర్లు

మహీంద్రా మారాజో పైన రూ.36,000 వరకు గరిష్టంగా డిస్కౌంట్ వస్తోంది. క్యాష్ బెనిఫిట్స్ రూ.15000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15000, కార్పోరేట్ డిస్కౌంట్ రూ.6000 వరకు ఆఫర్ ఉంది.

మహీంద్రా బోలెరోపై రూ.24,050 వరకు ఆఫర్ ఉంది. దీనిపై రూ.3,500 వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4,000 వరకు ఆఫర్ లభిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+