ఈ ప్రభుత్వ స్కిం మహిళలకు వరం.. సేవింగ్స్ పెట్టుబడితో మంచి లాభం...
ప్రతి ఒక్కారి ఇంట్లో మహిళలు ఏదో ఒక విధంగా డబ్బు ఆదా చేయడానికి చూస్తుంటారు. అనవసర ఖర్చులకి బదులు ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని డబ్బుని ప్లాన్ చేస్తారు. అయితే సేవింగ్స్ చేసిన డబ్బు పై మంచి వడ్డీ లభిస్తే ఇంకా మహిళలకి పండగే. మీరు మహిళ అయితే మీ సేవింగ్స్ పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ కాలంలోనే బంపర్ రాబడిని పొందాలనుకుంటే ఈ వార్త మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేక పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది, దీనిని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని పిలుస్తారు. ఏ స్త్రీ అయినా ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చని అలాగే ఆమె చేసిన డిపాజిట్ పై 7.50% అన్యువల్ వడ్డీని పొందవచ్చని తెలిపింది.
2 లక్షల వరకు పెట్టుబడి
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 2 సంవత్సరాలు. ఈ పథకం కింద ఏ స్త్రీ అయినా కనీసం రూ. 1,000 నుండి అత్యధికంగా రూ. 2,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద ఏ వయస్సు మహిళలు అయినా అకౌంట్ తెరవవచ్చు. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ పథకం అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు.

ఈ పథకంలో అకౌంట్ ఎలా తెరవాలి
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మీరు పోస్టాఫీసు లేదా ఆథరైజేడ్ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ తెరవవచ్చు. అకౌంట్ తెరిచేటప్పుడు మీరు ఫామ్‌ను సబ్మిట్ చేయడం ద్వారా KYC ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇందుకోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ డాకుమెంట్స్ అవసరం. ఈ పథకం కింద మహిళలు 31 మార్చి 2025లోపు ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా
ఈ పథకం కింద ప్రభుత్వం కస్టమర్లకు ముందస్తు విత్ డ్రా సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంటే ఈ పథకం కింద కస్టమర్లు డిపాజిట్ చేసిన మొత్తంలో ఒక సంవత్సరం తర్వాత 40% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతే కాకుండా ఏదైనా పరిస్థితుల్లో కస్టమర్ మరణిస్తే నామినీ క్లెయిమ్ ద్వారా డిపాజిట్ చేసిన మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కస్టమర్ ఏదైనా కారణంగా మెచ్యూరిటీకి ముందుగానే అకౌంట్ మూసివేస్తే అతనికి 7.50% బదులుగా 5.50% వడ్డీ లభిస్తుంది.


Click it and Unblock the Notifications