మహిళా ఎంటర్‌ప్రెన్యూయర్స్‌కు గుడ్‌న్యూస్. మహిళా మనీ, వీసా, ట్రాన్స్‌కార్ప్ కలిసి మహిళా మనీ ప్రీపెయిడ్ కార్డుని తీసుకువచ్చాయి. మహిళా వ్యాపారులు సులభంగా చెల్లింపులను స్వీరించేందుకు, రుణాలు పొందడానికి, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ పైన రివార్డ్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్డును అందుబాటులోకి తెచ్చారు. మహిళా వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి ఈ ప్రీపెయిడ్ కార్డు ఉపయోగం.

సర్వేలో ఏం తేలిందంటే
ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 81 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 80.7 శాతం మంది మహిళలు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఇందులో 55 శాతం మంది మహిళలు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాలను పెద్దగా ఉపయోగించడం లేదని తేలింది. మరో సర్వేలో దాదాపు మూడింట రెండు వంతుల మంది పట్టణ మహిళలు డిజిటల్ చెల్లింపులు ఉపయోగిస్తుండగా, వారిలో మూడు వంతుల కంటే తక్కువ మంది మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగిస్తున్నారు.

డిజిటల్ చెల్లింపులు సులభతరం
డిజిటల్ చెల్లింపులు స్వీకరించడాన్ని సులభతరం చేయడం ద్వారా మహిళా వ్యాపారులు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను పెంచుకోవడంలో ప్రీపెయిడ్ కార్డు ప్రయోజనకరం. అలాగే వ్యాపార విస్తరణ కోసం తీసుకునే రుణాలను కూడా నేరుగా కార్డులోకి బదలీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా ప్రోత్సాహకాలు, రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్,కు కూడా మహిళా వ్యాపారులకు ప్రీపెయిడ్ కార్డు అందిస్తుంది.

ఫిజికల్ కార్డు, డిజిటల్ కార్డు
ఈ ప్రిపెయిడ్ కార్డు డిజిటల్ రూపంలోను అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఫిజికల్ కార్డు తీసుకోవాలని భావిస్తే, అభ్యర్థనపై కార్డును మీ అడ్రస్‌కు పంపిస్తారు. డిజిటల్ కార్డు డిఫాల్టుగా వస్తుంది. బ్యాంకు అకౌంట్‌ను నిత్యం ఉపయోగించకుండా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించే మహిళలకు ఇది ప్రయోజనకరం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications