Lump Sum Investment Strategy: మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిందా? ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే దానికున్న బెస్ట్ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పెద్దమొత్తంలో డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్న విషయంలో కాస్త భయం ఉండడం సహజం. మార్కెట్ పడిపోతే ఎలా? అన్నది చాలామంది పెట్టుబడిదారుల మదిలో మెదిలే ప్రశ్న. దీని గురించి పూర్తి విశ్లేషణ చూద్దాం..

ఒకవేళ మీకు ఏదైనా ఆస్తులు అమ్మడం ద్వారా పెద్దమొత్తంలో(Lumpsum Amount) డబ్బు వచ్చినప్పుడు ఇలాంటి గందరగోళమే ఎదురవుతుంది. ఒకేసారి పెట్టుబడి పెడితే మార్కెట్ పడిపోతుందేమోనని భయం, ఆలస్యం చేస్తే రాబడి కోల్పోతామేమోనని ఆందోళన. ఈ సందిగ్ధతను అధిగమించేందుకు ఒక అద్భుతమైన సాధనం ఉంది. అదే STP..
సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (STP)
పెద్ద మొత్తంలో డబ్బును ఈక్విటీలోకి హడావిడిగా మళ్లించడం సరికాదు. ఒకేసారి పెట్టినప్పుడు మార్కెట్ పడిపోతే.. అది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి, దీర్ఘకాలిక లక్ష్యాలను పక్కదోవ పట్టిస్తుంది. అందుకే దీనికోసం సులభమైన మార్గం సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (STP). ఈ ప్లాన్ ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని ఒక ఫండ్ (సేఫ్ ఫండ్)లో పార్క్ చేసి.. అక్కడి నుంచి నిర్ణీత వ్యవధిలో (ఉదాహరణకు 18,24, 36 నెలలు) చిన్న మొత్తాలను క్రమంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోకి మళ్లిస్తారు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
డబ్బును పార్కింగ్ చేయడానికి సరైన మార్గం ఏది?
STP ద్వారా ఈక్విటీలోకి డబ్బును తరలించే ముందు ఆ డబ్బును సురక్షితంగా ఎక్కడ పార్క్ చేయాలని మీకు డౌట్ రావొచ్చు. అయితే దీనికి నిపుణులు సూచిస్తున్న ఫండ్స్ రెండు ఉన్నాయి. అవే.. లిక్విడ్ ఫండ్స్, ఆర్బి్ట్రాజ్ ఫండ్స్. పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న డబ్బుకు రాబడి కంటే భద్రత ముఖ్యం. కాబట్టి ఈ తరహా ఫండ్స్ ఎంచుకోవడం మంచిది.
1. లిక్విడ్ ఫండ్ (Liquid Fund): ఎక్కువ పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇదొక మంచి చాయిస్. దీని విలువ దాదాపుగా హెచ్చుతగ్గులకు లోనుకాదు. మీ డబ్బుని సేఫ్ గా ఉంచుతుంది. STP అమలులో ఉన్నంత వరకు మనశ్శాంతిని ఇస్తుంది.
2. ఆర్బిట్రేజ్ ఫండ్ (Arbitrage Fund): మీరు అధిక పన్ను పరిధి (High Tax Bracket)లో ఉంటే.. లిక్విడ్ ఫండ్ల కంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్వల్పంగా మెరుగైన ట్యాక్స్ బెనిఫిట్స్ ను అందిస్తాయి. 18 లేదా 24 నెలల కాలవ్యవధికి ఇది లాభదాయకంగా ఉంటుంది.
క్రమశిక్షణే విజయం
మార్కెట్ కొద్దిగా పడిపోగానే డబ్బు వెనక్కి తీసుకోవడం, ఊహించిన దానికంటే వేగంగా తిరిగి ప్రవేశించడం లేదా నిరంతరం మార్కెట్ సమయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం వంటివి పెట్టుబడిదారులు చేసే సాధారణ తప్పులు. కాబట్టి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. మీ దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉంటే వాటిని పైన చెప్పిన రెండు ఫండ్సలో ఒకదాంట్లో పార్క్ చేసి.. మెల్లగా డబ్బుని ఈక్విటీలోకి మళ్లించొచ్చు. STP అనేది మ్యాజిక్ కాదు, అదొక బిహేవియరల్ టూల్. అంటే మీకు మీ డబ్బు గురించి భయం లేదా పశ్చాత్తాపం లేకుండా మార్కెట్‌లో స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications