వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, బెస్ట్ హోంలోన్ ఆఫర్, ప్రాసెసింగ్ ఫీజు
వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇటీవల దశాబ్ద కనిష్టానికి చేరుకున్నాయి. అంతకుముందు మందగమనం, గత ఏడాది కరోనా కారణంగా డిమాండ్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది. దీంతో బ్యాంకులు రుణాలపై ముఖ్యంగా హోంలోన్ పైన వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కొన్ని బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు పది సంవత్సరాలు, పదిహేను సంవత్సరాల కనిష్టాన్ని చేరుకున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు రద్దు, మరిన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ఇస్తున్నాయి.

కొటక్ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు
ప్రస్తుతం హోంలోన్ వడ్డీ రేటు అతి తక్కువ కొటక్ మహీంద్రా బ్యాంకు ఇస్తోంది. మిగతా బ్యాంకులు కూడా దాదాపు అంతే ఉన్నాయి. అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా 7 శాతం లోపే ఉన్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.10,000. ఆర్ఎల్ఎల్ఆర్ బెంచ్ మార్క్. రూ.1 లక్షకు ఈఎంఐ రూ.754.

ఇతర ప్రయివేటు బ్యాంకుల్లో...
HDFC బ్యాంకు హోంలోన్ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం ఉంటుంది. కనీసం రూ.3వేలు, గరిష్టం రూ.10వేలు ప్రాసెసింగ్ ఫీజు ఉంది. రూ.1 లక్షకు ఈఎంఐ రూ.757.
ICICI బ్యాంకు హోంలోన్ వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం ఉంటుంది. గరిష్టం రూ.10వేలు ప్రాసెసింగ్ ఫీజు ఉంది. రూ.1 లక్షకు ఈఎంఐ రూ.757.
HSBC బ్యాంకు హోంలోన్ వడ్డీ రేటు 6.74 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం. గరిష్టం రూ.10,000గా ఉంది.

ఈ బ్యాంకుల్లో ఎంతంటే?
డాయిష్ బ్యాంకు కనిష్ట హోంలోన్ వడ్డీ రేటు 6.49 శాతం. రూ.1 లక్షకు ఈఎంఐ రూ.745గా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.70 శాతం. ఈఎంఐ రూ.757. సిటీ బ్యాంకు హోంలోన్ వడ్డీ రేటు 6.75 శాతం. రూ.1 లక్షకు రూ.760 ఈఎంఐ పడుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా క్యాపిటల్ కనిష్ట వడ్డీ రేటు 6.80 శాతం. రూ.1 లక్షకు ఈఎంఐ రూ.763. బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు కనిష్ట వడ్డీ రేటు 6.85 శాతం. ఈఎంఐ నెలకు రూ.766. యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం కాగా, రూ.1 లక్షకు ఈఎంఐ రూ.769.


Click it and Unblock the Notifications