అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే దానికి గోల్డ్ లోన్ ఒక మంచి అవకాశం. మీ బంగారాన్ని అమ్మకుండా కేవలం తాకట్టు పెట్టి ఈజీగా డబ్బు పొందవచ్చు. పైగా బంగారంపై రుణం (Gold Loan) తీసుకోవడం కూడా చాలా సులభం. అలాగే సురక్షితం కూడా. అయితే ప్రస్తుతం గోల్డ్ లోన్ ను ఏయే బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFC) సుమారు 8 శాతం వడ్డీకి గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. రీసెంట్ డేటా ప్రకారం తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇస్తున్న టాప్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం. అలాగే రూ.లక్ష లోన్ తీసుకుని 12 నెలల EMI పెట్టుకుంటే ఏ బ్యాంకులో ఎంత కట్టా్ల్సి వస్తుందో కూడా తెలుసుకుందాం.
ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): ఈ బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే తక్కువగా 8.35 శాతం వడ్డీకే గోల్డ్ లోన్‌ను అందిస్తోంది. రూ.1 లక్ష లోన్‌కు నెలవారీ EMI సుమారు రూ. 8,715 ఉంటుంది. (ఒక ఏడాది టెన్యూవర్ పెట్టుకుంటే)
- ఇండియన్ బ్యాంక్/ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank): ఈ రెండు బ్యాంకులు 8.75 శాతం వడ్డీతో బంగారంపై రుణాలను అందిస్తున్నాయి. రూ 1 లక్ష లోన్‌కు నెలవారీ EMI సుమారు రూ.8,734 గా ఉంటుంది.
- కెనరా బ్యాంక్ (Canara Bank): ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.95 శాతం నుంచి మొదలవుతుంది. రూ. లక్షకు నెలవారీ EMI సుమారు రూ.8,743 ఉంటుంది.
- కొటక్ మహీంద్రా బ్యాంక్: ఇక్కడ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.00 శాతం నుంచి మొదలవుతుంది. నెలవారీ EMI సుమారు రూ. 8,745 ఉంటుంది.
- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank): ఈ బ్యాంకులో వడ్డీ రేటు 9.30 శాతం ఉంటుంది. దీనికి నెలవారీ EMI సుమారు రూ.8,759 కట్టాలి.
- బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)/ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India): ఈ రెండు బ్యాంకులు 9.40 శాతం వడ్డీ రేటుతో లోన్స్ ఇస్తున్నాయి. వీటికి నెలవారీ EMI సుమారు రూ.8,764 గా ఉంటుంది.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంకులో వడ్డీ రేటు 9.65 శాతం నుంచి మొదలవుతుంది. నెలవారీ EMI సుమారు రూ.8,775 అవుతుంది.
- యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): ఇక్కడ వడ్డీ రేటు 9.75 శాతం ఉంటుంది. నెలవారీ EMI సుమారు రూ. 8,780 అవుతుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో వడ్డీ రేటు చాలా ఎక్కువగా 10.00 శాతం నుంచి మొదలవుతుంది. దీనికి నెలవారీ EMI సుమారు రూ.8,792 కట్టాల్సి ఉంటుంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank): ఇక ఈ బ్యాంకు అన్నింటికంటే ఎక్కువగా10.50 శాతం వడ్డీ రేటుతో లోన్ ఇస్తోంది. దీనికి నెలవారీ EMI సుమారు రూ.8,815 ఉంటుంది.
లోన్ తీసుకునే ముందు..
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ముందుగా ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకి ఇస్తుందో చూసి ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ఎన్ని నెలల టెన్యూవర్ కు ఎంత EMI కట్టాలి అనేది మీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఇక లోన్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే.. ప్రతి బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ పాలసీలు భిన్నంగా ఉంటాయి. వడ్డీ రేట్లు కూడా మీ ఎలిజిబిలిటీ, బ్యాంక్ పాలసీలను బట్టి మారవచ్చు. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే లోన్ కు అప్లై చేయండి.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications