కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను స్థీరంగా కొనసాగించింది. ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచలేదు. ఆర్బీఐ రెపో రేటు స్థిరంగా కొనసాగించడంతో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వడ్డీ రేట్లను పెంచవు. ఇది ఈ రంగాల్లోని వారికి పెద్ద ఊరట.
శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రకటనను రియాల్టీ డెవలపర్స్ స్వాగతించారు. కరోనా తర్వాత హోమ్ సోల్స్ క్రమంగా కుదురుకుంటున్నాయని, ఇప్పుడు వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించడం కలిసి వస్తుందని రియాల్టీ డెవలరప్స్ చెబుతున్నారు.

రియాల్టీ రంగానికి ఊతం
రెపో రేటును 4 శాతం వద్ద స్థిరంగా కొనసాగించడం రియాల్టీ రంగానికి ఊతమిస్తుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఆఫ్ రియాల్టర్స్ బాడీ హర్షవర్ధన్ పటోడియా అన్నారు. కరోనా తర్వాత వివిధ రంగాలపై ఎంతో ప్రభావం పడిందని, తాజా ఆర్బీఐ నిర్ణయం ఆర్థిక వృద్ధికి, భారత వృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ముఖ్యంగా వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించడం హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనమని తెలిపారు. పరిస్థితులను బట్టి ఆర్బీఐ వడ్డీ రేట్లను వచ్చేసారి కూడా స్థిరంగా కొనసాగించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. అయితే వడ్డీ రేట్లు ఎప్పుడైనా పెరిగే అవకాశాలున్నాయి.

సొంతింటి కల
చాలామందికి సొంతిల్లు ఓ కల. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా కట్టుకునే వారికి హోమ్ లోన్ చాలా మంచి ఎంపిక. హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీరేటుపై రుణాలు ఇచ్చే బ్యాంకు ఈఎంఐ చెల్లింపులు తమ ఆదాయ వనరులను బట్టి ఇళ్ల కొనుగోలుదారులు రుణాలు తీసుకుంటారు. తేలిగ్గా తక్కువ వడ్డీరేట్లకే రుణాలు ఇచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వైపు మొగ్గుతారు. దేశంలోని పది బ్యాంకులు తక్కువ వడ్డీపై హోమ్ లోన్ మంజూరు చేస్తున్నాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. యూబీఐ కనీసం 6.6 శాతం, గరిష్టం 7.35 శాతం, పీఎన్‌బీ కనీసం 6.5 శాతం, గరిష్టం 7.65 శాతం, కొటక్ మహీంద్రా కనీసం 6.55 శాతం, గరిష్టం 7.05 శాతం, ఐడీఎఫ్‌సీ కనీసం 6.6 శాతం, గరిష్టం 8.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు కనీసం 6.7 శాతం, గరిష్టం 7.04 శాతం, కెనరా బ్యాంకు కనీసం 6.65 శాతం, గరిష్టం 8.09 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కనీసం 6.4 శాతం, గరిష్టం 7.08 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం 6.5 శాతం, గరిష్టం 8.02 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా కనీసం 6.5 శాతం, గరిష్టం 7.85 శాతంగా ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications