సాధారణంగా క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే లోన్ ఈజీగా అప్రూవ్ అవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ, కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉన్నా కూడా లోన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి పలు రకాల కారణాలున్నాయి(loan rejection reasons). అవేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లోన్ పొందడం ఈజీ అని చాలామంది భావిస్తుంటారు. అయితే క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండా కొన్నిసార్లు బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీనికి ఉద్యోగం, అల్రెడీ ఉన్న లోన్స్, మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ వంటి రకరకాల కారణాలు ఉండొచ్చు.
క్రెడిట్ స్కోర్ ఇలా లెక్కిస్తారు
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక అలవాట్లను అలాగే మీరు అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. తీసుకున్న లోన్ సకాలంలో చెల్లిస్తే ఈ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. లోన్ ఈఎంఐ లేట్ గా కట్టినా లేదా ఎక్కువ లోన్స్ కు అప్లై చేసినా, ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తున్నా.. ఈ స్కోర్ తగ్గుతూ పోతుంది. అలాగే ఇందులో చాలా ఇతర అంశాలు ఉంటాయి. అయితే లోన్ అప్రూవ్ అవ్వడానికి ఈస్కోర్ ఒక్కటే సరిపోదు. దీంతోపాటు బ్యాంకులు కొన్ని ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి.
ఉద్యోగం
లోన్ అప్రూవ్ చేయడానికి బ్యాంకు ముందుగా మీ ఆదాయ వనురుని చూస్తుంది. అంటే స్థిరమైన ఉద్యోగం ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగున్నా.. మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తుంటే లేదా ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే, బ్యాంకులు మీ లోన్ ను రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు ఒకే రంగంలో ఎక్కువకాలంగా పని చేస్తుంటే.. లేదా మంచి సంస్థలో ఉద్యోగిగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ కాస్త తక్కువ ఉన్నప్పటికీ మీ లోన్ అప్రూవ్ అయ్యే చాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న అప్పు
మీకు ప్రస్తుతం ఎంత అప్పు ఉంది అన్నది కూడా బ్యాంకులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ లోన్స్ ఉన్నా లేదా ఆదాయంలో 40-50 శాతం కంటే ఎక్కువ ఇప్పటికే EMI చెల్లింపుల కోసం ఖర్చు చేస్తున్నట్టయితే బ్యాంకులు మీకు కొత్త లోన్ ఇవ్వడానికి వెనుకాడవచ్చు.
ఎక్కువ క్రెడిట్ కార్డులు
ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం లేదా రకరకాల ప్లాట్ ఫామ్స్ లో లోన్స్ కోసం ట్రై చేయడం వంటివి చేస్తుంటే.. బ్యాంకులు మీరు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తి్స్తాయి. ఫలితంగా మీకు లోన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో దరఖాస్తును తిరస్కరిస్తుంటాయి.
ఫస్ట్ టైం లోన్ అయితే..
ఇకపోతే మొదటిసారి లోన్ తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ నిబంధన తొలగించబడింది. అంటే ఫస్ట్ టైం లోన్ కోసం అప్లై చేసేవారి క్రెడిట్ స్కోర్ చూసి బ్యాంకులు లోన్ ను తిరస్కరించకూడదు. కేవలం వారి ఆదాయం, జాబ్ సేఫ్టీ వంటి ఇతర అంశాల ఆధారంగా మాత్రమే అంచనా వేయాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications