ఈ రోజుల్లో వ్యక్తిగత అవసరాలు, వైద్య ఖర్చులు, విద్య లేదా వ్యాపార అవసరాల కోసం రుణం పొందడం చాలా సులభంగా మారింది. అయితే అనుకోని ఆర్థిక సమస్యలు, ఉద్యోగ మార్పులు లేదా ఆదాయం తగ్గడం వంటి కారణాల వల్ల కొంతమంది రుణగ్రహీతలు తమ EMIలను సకాలంలో చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటువంటి సందర్భాల్లో బ్యాంకులు లేదా NBFCలు బకాయి మొత్తాలను తిరిగి పొందేందుకు రికవరీ ఏజెంట్లను నియమిస్తాయి. కానీ ఇటీవల కాలంలో కొందరు రికవరీ ఏజెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, రుణగ్రహీతలను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠినమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ నియమాల ప్రధాన ఉద్దేశ్యం.. రుణ వసూలు ప్రక్రియ చట్టబద్ధంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంతో జరగాలని నిర్ధారించడం అని చెప్పవచ్చు.

రికవరీ ఏజెంట్లు ఏమి చేయలేరు?: RBI మార్గదర్శకాల ప్రకారం.. రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకూడదు. వారు బెదిరింపులు చేయడం, దుర్భాష ఉపయోగించడం, మానసిక ఒత్తిడి కలిగించే వ్యాఖ్యలు చేయడం పూర్తిగా నిషేధం. అలాగే, రాత్రి ఆలస్యంగా లేదా తెల్లవారుజామున పదే పదే కాల్స్ చేయడం కూడా తప్పు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు లేదా పొరుగువారి ముందు రుణగ్రహీతను అవమానించడం, భౌతిక హానితో బెదిరించడం లేదా ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం కూడా RBI నియమాలకు విరుద్ధం.
రికవరీ ఏజెంట్లు ఏమి చేయగలరు?: రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్యలో మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. ప్రతి కాల్‌లో లేదా కలిసినప్పుడు వారు తమను తాము పరిచయం చేసుకొని, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంక్ లేదా NBFC పేరును స్పష్టంగా చెప్పాలి. రుణానికి సంబంధించిన వివరాలను మూడవ పక్షాలతో పంచుకోవడం నిషేధం. సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో రుణ వివరాలను ప్రచురించడం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రికవరీ ఏజెంట్లు అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించబడినా..వారి ప్రవర్తనకు పూర్తి బాధ్యత బ్యాంక్ లేదా NBFCదే. అందుకే బ్యాంకులు ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలి, ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.
వేధింపులు ఎదురైతే ఏమి చేయాలి? : ముందుగా సాక్ష్యాలను సేకరించాలి. కాల్ రికార్డింగ్‌లు, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్‌లు వంటివి భద్రపరచాలి. ఆ తర్వాత సంబంధిత బ్యాంక్ లేదా NBFC కస్టమర్ కేర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే.. RBI Complaint Management System (CMS) ద్వారా ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. బెదిరింపులు లేదా హింస ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలి.
EMI చెల్లించలేకపోతే ఉన్న ఎంపికలు: RBI కేవలం శిక్షలు విధించడమే కాకుండా, రుణగ్రహీతలకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తుంది. EMI తగ్గింపు, లోన్ వ్యవధి పొడిగింపు, తాత్కాలిక మారటోరియం లేదా ఒకేసారి పరిష్కారం (సెటిల్‌మెంట్) వంటి మార్గాలను బ్యాంకుతో చర్చించవచ్చు. అయితే ప్రతీ ఒప్పందం వ్రాతపూర్వకంగా ఉండాలి.
ఏయే అంశాలను నివారించాలి?: Loan రికవరీ ఏజెంట్లకు నగదు చెల్లించకూడదు. సరైన గుర్తింపు లేకుండా పత్రాలు ఇవ్వకూడదు. ఒత్తిడితో అన్యాయమైన నిబంధనలకు అంగీకరించకూడదు.ఏదేమైనా RBI నియమాలు రుణగ్రహీతల గౌరవం, గోప్యతను కాపాడేందుకు రూపొందించడం జరిగింది. మీరు మీ హక్కులు తెలుసుకుని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటే, రికవరీ వేధింపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications