Loan EMI: ఎక్స్‌ట్రా మనీ ఉందా? లోన్ క్లియర్ చేయాలా లేక షేర్ మార్కెట్లో పెట్టాలా? ఏది లాభం?

చాలా మందికి నెల తిరిగేసరికి వచ్చే పెద్ద తలనొప్పి లోన్ ఈఎంఐ (Loan EMI). చేతిలో కాస్త అదనంగా డబ్బులు ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే.. "ఈ డబ్బుతో లోన్ కాస్త కట్టేసి భారం తగ్గించుకుందామా? లేక ఈ మనీని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి అంతకంటే ఎక్కువ లాభం పొందుదామా?" అని. నిజానికి ఇది ఒక చిన్నపాటి యుద్ధం లాంటిదే. అయితే, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది మీ పరిస్థితిని బట్టి మారుతుంటుంది. అసలు లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు సింపుల్‌గా చూద్దాం.

Loan EMI vs Investment Which Is Better To Build Wealth Early Financial Guide For Beginners 2026

గ్యారెంటీ లాభం కావాలా? రిస్క్ తీసుకుంటారా?

మీరు లోన్ ముందుగానే కడితే (Prepayment), అది మీకు గ్యారెంటీ లాభాన్ని ఇస్తుంది. ఎలాగంటే.. మీరు 10% వడ్డీ ఉన్న లోన్‌ను త్వరగా కడితే, మీరు ఇండైరెక్ట్‌గా ఆ 10% వడ్డీని ఆదా చేసినట్లే. అంటే మీకు రిస్క్ లేకుండా 10% లాభం వచ్చినట్టు లెక్క. అదే మీరు ఆ డబ్బును వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ 10% కంటే ఎక్కువ లాభం వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఒక్కోసారి నష్టం కూడా రావచ్చు. కాబట్టి సేఫ్ సైడ్ ఉండాలనుకునే వారికి లోన్ తీర్చడమే బెస్ట్.

'మంచి అప్పు'.. 'చెడ్డ అప్పు'.. తేడా ఏంటి?

అప్పుల్లో కూడా రకాలు ఉంటాయి. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బాకీలు వంటివి చాలా ప్రమాదకరమైనవి. వీటిపై వడ్డీ రేట్లు 14% నుండి 40% వరకు ఉంటాయి. ఇంత భారీ వడ్డీ ఉన్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేయడం కంటే ఆ లోన్ ఈఎంఐ (Loan EMI) భారాన్ని వదిలించుకోవడమే తెలివైన పని. ఎందుకంటే మార్కెట్లో 40% లాభం రావడం చాలా కష్టం. కానీ, హోమ్ లోన్ వంటి వాటికి వడ్డీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి 'మంచి అప్పులు' ఉన్నప్పుడు, మీరు ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే దీర్ఘకాలంలో లోన్ వడ్డీ కంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.

అత్యవసర నిధి (Emergency Fund) ముఖ్యం

చాలా మంది చేసే తప్పు ఏంటంటే, చేతిలో ఉన్న పైసా పైసా తీసుకెళ్లి లోన్ కట్టేస్తారు. కానీ రేపు పొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే లోన్ కట్టే ముందు మీ దగ్గర కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఉందో లేదో చూసుకోండి. లిక్విడిటీ (నగదు లభ్యత) అనేది చాలా అవసరం. ఒకసారి లోన్ కట్టేస్తే ఆ డబ్బు తిరిగి రాదు, అదే ఇన్వెస్ట్ చేస్తే అవసరానికి వాడుకోవచ్చు.

మానసిక ప్రశాంతత ముఖ్యం

చివరగా.. ఇది కేవలం లెక్కల విషయం మాత్రమే కాదు, మీ మనశ్శాంతికి సంబంధించినది కూడా. కొంతమందికి అప్పు ఉంటే నిద్ర పట్టదు. అలాంటి వారు ఏ లాభాల గురించి ఆలోచించకుండా లోన్ క్లియర్ చేసుకోవడమే మంచిది. "అప్పు లేని వాడే అధిక బలుడు" అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా! మీకు గనుక అప్పు ఉన్నా పర్వాలేదు, లాభాలే ముఖ్యం అనుకుంటే మాత్రం స్ట్రాటజిక్ గా ఇన్వెస్ట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+