సిబిల్ స్కోర్ 750 అంటే చాలా మంచి స్కోర్. చాలా మంది "ఇంత మంచి స్కోర్ ఉంది కాబట్టి లొన్ ఈజీగా వస్తుంది" అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అలా కాదు. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నా కూడా బ్యాంకులు కొన్నిసార్లు లొన్ రిజెక్ట్ చేస్తాయి. ఎందుకంటే బ్యాంకులు కేవలం స్కోర్ మాత్రమే చూడవు ఇంకా కొన్ని గోప్యమైన అంశాలు కూడా పరిశీలిస్తాయి. ఫైనాన్షియల్ నిపుణుడు రితేష్ సబర్వాల్ చెబుతున్న ఐదు ముఖ్యమైన కారణాలు ఇవి
1. ఆదాయం vs అప్పు పొంతన చాలా ముఖ్యం. బ్యాంకులు మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారో అందులో ఎంత మొత్తం ఇప్పటికే EMIలు చెల్లించడానికి వెళ్తుందో జాగ్రత్తగా పరిశీలిస్తాయి. సాధారణంగా EMIలు మీ మొత్తం జీతంలో 40% లోపులో ఉండాలని వారు ఆశిస్తారు. EMIలు ఈ పరిమితిని దాటితే, కొత్త లొన్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉందని బ్యాంకులు భావిస్తాయి.

ఉదాహరణకి మీ నెల జీతం రూ. 1 లక్ష అయితే, EMIలు రూ. 45,000 ఉంటే DTI 45% అవుతుంది. ఈ పరిస్థితిలో 750 స్కోర్ ఉన్నా కూడా బ్యాంకు లొన్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది "ఇప్పటికే చాలా అప్పు ఉంది" అని భావిస్తారు.
2. మీ క్రెడిట్ కార్డు లేదా లిమిట్‌లో ఎంత వాడుతున్నారో కూడా బ్యాంకులు గమనిస్తాయి. సాధారణంగా "30% కంటే ఎక్కువ ఉపయోగించడం" రిస్క్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు రూ. 2 లక్షల లిమిట్‌లో రూ. 1 లక్ష వాడితే అది 50% వినియోగం అవుతుంది. ఇది లెండర్ల దృష్టిలో రెడ్ ఫ్లాగ్‌గా మారుతుంది.
3. స్కోర్ ఎక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ చాలా చిన్నదిగా ఉంటే బ్యాంకులు నమ్మకం పెట్టుకోవు. ఉదాహరణకు - 6 నెలల హిస్టరీతో 750 స్కోర్ ఉన్నవారికంటే, 3 సంవత్సరాల స్థిరమైన హిస్టరీతో 720 స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.
4. 3 నెలల్లో 3 కంటే ఎక్కువ లొన్ అప్లికేషన్లు వేస్తే, లెండర్లు దానిని "ఫైనాన్షియల్ ప్రెజర్"గా తీసుకుంటారు. దాంతో లొన్ ఆమోద అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే మీరు తరచుగా ఉద్యోగాలు మారుతున్నా బ్యాంకులు దానిని స్టేబుల్‌గా చూడవు. ఉదాహరణకు - 2 సంవత్సరాల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ జాబ్ చేంజ్‌లు చేసుంటే, స్కోర్ ఎంత ఉన్నా బ్యాంకు లొన్ ఇవ్వడంలో జాగ్రత్తగా ఉంటుంది.
5. సబర్వాల్ చెప్పిన కొన్ని సింపుల్, ప్రాక్టికల్ సూచనలలో ముందుగా, మీ DTI ను 40% లోపల ఉంచడం ముఖ్యం. జాబ్ లో స్థిరత్వాన్ని చూపించడం కూడా అవసరం తరచుగా ఉద్యోగాలు మార్చకండి. క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే ఎక్కువ ఉపయోగించరాదు అంటే లభ్యమైన క్రెడిట్‌ను అతి ఎక్కువగా వాడకండి. పొడవైన, క్రమబద్ధమైన క్రెడిట్ చరిత్రను నిర్మించడం అవసరం, ఇది బ్యాంకుల వాళ్ళకి మీరు నమ్మదగినవారని చూపిస్తుంది. చివరగా, తక్కువ సమయంలో ఎక్కువ లొన్ అప్లికేషన్లు వేయడం మానుకోండి, ఎందుకంటే ఇది ఆర్థిక ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ సింపుల్ చిట్కాలన్నీ పాటిస్తే, మీ లొన్ ఆమోద అవకాశాలు పెరుగుతాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications