LIC: గుడ్ న్యూస్.. ఎల్ఐసీ నుంచి పేదలు, మహిళల కోసం రెండు పాలసీలు..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్యే రెండు పాలసీలు తీసుకొచ్చింది. అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పాలసీలు తీసుకొచ్చింది. ఇందులో ఒకటి ఎల్ఐసీ జన్ సురక్ష యోజన కాగా, రెండోది ఎల్ఐసీ బీమా లక్ష్మి యోజన. జన్ సురక్ష యోజన అనేది తక్కువ ఖర్చుతో అందిస్తున్న జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్)గా కంపెనీ చెబుతోంది. దీనికి అదనంగా పొదుపు (సేవింగ్స్) చేసే లాభం కూడా ఉందని ప్రకటించింది. ఇది చిన్న, మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని పేర్కొంది. తక్కువ లేదా పరిమిత ఆదాయం ఉన్న వారికీ/కుటుంబాల కోసం తక్కువ ఖర్చుతో లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఈ చిన్న పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించింది.

ఈ పాలసీ తీసుకున్న సమయంలో ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి బీమా మొత్తం డబ్బు రానుంది. ఒకవేళ పాలసీ ముగిసేవరకు (మెచూరిటీ) పాలసీదారుడు బతికి ఉంటే, అప్పటివరకు జమ చేసిన డబ్బు (హామీ మొత్తం) తో పాటు, సేవింగ్స్ ద్వారా వచ్చిన అదనపు లాభం కూడా లభిస్తుందని ఎల్ఐసీ పేర్కొంది. అంటే ఆర్ధిక రక్షణతో పాటు డబ్బు సంపాదించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇందులో బీమా కవరేజ్ మొత్తం కనీసం రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలం కనీసం 12 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉంటుంది.
పాలసీ కాలం ముగియడానికి ఐదు ఏళ్ల ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

LIC

18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. జన్ సురక్ష యోజన రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బీమా ద్వారా రక్షణ ఇంకా సేవింగ్స్ ద్వారా రాబడి కూడా అందిస్తుంది. కనీసం మూడు ఏళ్లు వరుసగా ప్రీమియం కడితే, పాలసీదారుడికి ఆటోమేటిక్‌గా జీవిత రక్షణ (లైఫ్ కవర్) కొనసాగుతుంది. ఒక సంవత్సరం ప్రీమియం కట్టిన తర్వాత, పాలసీపై లోన్ (అప్పు) తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. జన్ సురక్ష యోజన అనేది బీమా రక్షణ, పొదుపు రెండింటినీ సులువుగా, తక్కువ ఖర్చుతో పొందడానికి ఒక మంచి మార్గంగా ఎల్ఐసీ చెప్పుకుంటుంది. తక్కువ ఖర్చుతో ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఇది చాలా మంచి అప్షన్ అని పేర్కొంటోంది.

ఎల్ఐసీ బీమా లక్ష్మి యోజన అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సమగ్ర బీమా పథకం. ఇది రక్షణ, పొదుపు, మనుగడ ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో చెల్లించిన మొత్తం వార్షిక ప్రీమియంలలో పట్టిక రూపంలో హామీ ఇచ్చిన సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం మహిళలు మూడు ఎంపికల నుంచి మనుగడ ప్రయోజనాలను ఎంచుకోవచ్చు. తరువాత సర్వైవర్ ప్రయోజనాలను పొందే ఎంపిక కూడా ఉంది. 7 నుంచి 15 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది. మెచ్యూరిటీ లేదా మరణ ప్రయోజనాన్ని వాయిదాలలో పొందడానికి ఆప్షన్ కూడా ఉంది. మూడు సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత ఆటో కవర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+