ఏదైనా కారణంతో మీ ఇన్సురెన్స్ పాలసీ రద్దయిందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఏ కారణంతో అయినా ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రకటించింది. ఈ రోజు (ఆగస్ట్ 10, సోమవారం) నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఈ పాలసీలు మినహా... లేట్ ఫీజుపై రాయితీ
టర్మ్ పాలసీలు, ఇతర అధఇక నష్టభయం పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించుకోవచ్చునని ఎల్ఐసీ తెలిపింది. ఆలస్య రుసుంపై 20 శాతం మినహాయింపు ఉందని, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం రాయితీ కూడా ఉంటుందని మరో అదనపు ఊరట కల్పించింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.

అయిదేళ్లలోపు ఉంటే పునరుద్ధరణ
ఏ పథకానికి కూడా వైద్యపరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే లేట్ ఫీజు మాత్రం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించలేని తేదీ నుండి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీ కాలవ్యవధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలు ఉందని తెలిపింది.

ఇది మంచి అవకాశం
కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అయిదేళ్ల నుండి తీసుకున్న నిర్ధిష్ట అర్హత కలిగిన పాలసీలను చెల్లించని మొదటి ప్రీమియం నుండి పునరుద్ధరించుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పాలసీదారులు తమ ఇన్సురెన్స్ పాలసీని కొనసాగించాలని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications