ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల సరికొత్త సేవింగ్స్ ఇన్సురెన్స్ పాలసీని తీసుకు వచ్చింది. ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ కొత్త పాలసీ పేరు ధనరేఖ. డిసెంబర్ 13, 2021 నుండి ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. ఈ ధనరేఖ ఉత్పత్తిలో ఎన్నో ప్రయోజనాలు, ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేక ప్రీమియం ధరలు ఉండటం గమనార్హం. ఈ ప్లాన్ థర్డ్ జెండర్‌కు కూడా వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద ఉన్న ప్రయోజనాలు అన్ని కూడా పూర్తి హామీతో కూడుకున్నవి.

సమ్ అస్యూర్డ్, వయో పరిమితి
- ధనరేఖ ప్లాన్ కింద మినిమం సమ్ అస్యూర్డ్ రూ.2 లక్షలు. మాగ్జిమమ్ సమ్ అస్యూర్డ్ పైన అప్పర్ రిస్ట్రిక్షన్స్ లేవు.
- పాలసీ టర్మ్ ఆధారంగా కనీస వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాలు. అలాగే, పాలసీ టర్మ్ ఆధారంగా మాగ్జిమమ్ వయస్సు 35 ఏళ్ల నుండి 55 ఏళ్లు.
- ఈ పాలసీని ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- ఏజెంట్లు/POSPLI/కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ వంటి (CPSC-SPV) ఇంటర్మీడియేట్స్, www.licindia.in. వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- లిక్విడిటీ రిక్వైయిర్మెంట్స్ కోసం ఈ ప్లాన్ ద్వారా లోన్ సౌకర్యం కూడా ఉంది.

పూర్తి చెల్లింపు
ఈ పాలసీ కొత్త ఫీచర్ ఏమంటే పాలసీ హోల్డర్‌కు పూర్తి సమ్ అస్యూర్డ్ చెల్లిస్తారు. మనీ బ్యాక్‌గా ఇచ్చిన మొత్తాన్ని మినహాయించరు. గ్యారెంటీగా చేర్చిన మొత్తాన్ని కూడా పాలసీ ముగింపు తర్వాత చెల్లిస్తారు.
పాలసీ ప్రారంభమైన తర్వాత ఆరేళ్ల నుండి పాలసీ గడువు ముగిసేవరకు ప్రతి సంవత్సరం గ్యారెంటీగా కొంత మొత్తాన్ని చేరుస్తారు.
బేసిస్ సమ్ అస్యూర్డ్‌లో కొంత శాతాన్ని అయిదేళ్లకోసారి, మనీ బ్యాక్ పాలసీ తరహాలో దఫాలుగా చెల్లిస్తారు. అయితే చెల్లింపు సమయంలో పాలసీ అమలులో ఉండాలి.

డెత్ బెనిఫిట్స్
సింగిల్ ప్రీమియం లేదా 10, 15, 20 సంవత్సరాల కాలానికి పరిమిత ప్రీమియంతో ఈ పాలసీ ప్రీమియాన్ని చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన నాటి నుండి హామీ మొత్తంలో కొంత శాతాన్ని పాలసీదారులకు సర్వైవల్ బెనిఫిట్‌గా క్రమం తప్పకుండా చెల్లిస్తారు. మెచ్యూరిటీ గడువు పూర్తి కాగానే పాలసీదారులకు మనీ బ్యాక్‌గా తిరిగి ఇచ్చిన మొత్తాన్ని మినహాయించకుండా పూర్తి హామీ మొత్తాన్ని గ్యారంటీగా జమ అయిన సొమ్ముతో కలిపి చెల్లిస్తారు. పాలసీ గడువులోగా పాలసీదారు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక మద్దతు ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీలో డెత్ బెనిఫిట్ కింద బేసిక్ హామీ మొత్తంపై 125 శాతం సొమ్ముతో పాటుగా గ్యారెంటీ ప్రయోజనాలను కలిపి చెల్లిస్తారు. లిమిటెడ్ ప్రీమియం పాలసీలో డెత్ బెనిఫిట్‌గా బేసిక్ హామీ మొత్తంపై 125 శాతం లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు సొమ్ము ఏది ఎక్కువైతే దానిని చెల్లిస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications