ఈ రోజుల్లో యువత తమ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలని, భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కల్పించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఈ మారుతున్న ఆర్థిక పరిస్థితులను గుర్తించిన LIC కూడా, యువత ఆశలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి మరియు జీవిత బీమా కలిపిన కొత్త ప్రణాళికలను తీసుకొచ్చింది. ఇప్పుడు యువత తమ లక్ష్యాలను నెరవేర్చడంలో, భద్రతతో పాటు సంపదను కూడబెట్టడంలో LIC కొత్త ప్లాన్లు మంచి మార్గంగా నిలుస్తున్నాయి. ఈ ప్లాన్లు యువతకి మాత్రమే కాదు సాధారణ కుటుంబాలకి కూడా వారి ఆర్దిక భద్రతను నెరవేర్చేందుకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తాజాగా రెండు కొత్త బీమా పథకాలను ప్రారంభించింది. అవే నవ జీవన్ శ్రీ (Nav Jeevan Shree Plan 912) మరియు నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం (Nav Jeevan Shree Single Premium Plan 911). ఇవి సేవింగ్స్ (పెట్టుబడి) మరియు ప్రొటెక్షన్ (బీమా రక్షణ) రెండింటినీ కలిపిన వ్యక్తిగత ప్లాన్లు. ఈ రెండు పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
నవ జీవన్ శ్రీ- రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం. 912)
ఇది ఒక రెగ్యులర్ ప్రీమియం ఎండౌమెంట్ పాలసీ. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ప్లాన్లుగా ఉంటుంది. ఇందులో మీరు 6, 8, 10 లేదా 12 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించవచ్చు. పాలసీ వ్యవధి 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండగా, ప్రతీ సంవత్సరం మీ ప్రీమియం మీద 8.5% నుంచి 9.5% వరకు గ్యారంటీడ్ అదిషన్ లభిస్తుంది. కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ట పరిమితి మాత్రం ఉండదు. పాలసీకి అర్హత పొందేందుకు కనీస వయసు 30 రోజులు, గరిష్టంగా 60 సంవత్సరాలు ఉండాలి. ఈ పాలసీ సిస్టమెటిక్ సేవింగ్స్ చేయాలనుకునే వ్యక్తులకు మంచి ఎంపిక.
నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం (ప్లాన్ నెం. 911)
ఇది ఒక సింగిల్ ప్రీమియం ప్లాన్. ఒకేసారి డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకునే వారికోసం రూపొందించబడింది. అంటే నెలనెలా లేదా సంవత్సరానికి రెగ్యులర్‌గా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఎండౌమెంట్ పాలసీ. మొదటి రోజే మీరు ఒకేసారి మొత్తంగా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. తర్వాత మీ పెట్టుబడి పాలసీ గడువు అంతా భద్రంగా ఉంటుంది. జీవిత బీమా రక్షణతో పాటు, మీరు నిర్ణీత కాలం తర్వాత గ్యారంటీగా లాభాన్ని పొందుతారు.
ఈ పాలసీకి కనీస కాలం 5 సంవత్సరాలు కాగా, గరిష్ఠంగా 20 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఎంచుకునే పాలసీ కాలానికి అనుగుణంగా మీకు రిటర్న్స్ లభిస్తాయి. ఇందులో పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 30 రోజులు ఉండాలి. గరిష్ఠంగా 60 సంవత్సరాల లోపు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే కనిష్ట బీమా మొత్తంగా రూ.1 లక్ష ఉండాలి. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఎంచుకున్న బీమా మొత్తానికి ప్రతి వెయ్యి రూపాయలకు పాలసీ నడిచే ప్రతి సంవత్సరానికి రూ.85 గ్యారంటీడ్ లాభం జతవుతుంది. ఉదాహరణకి, మీరు రూ.5 లక్షల బీమా మొత్తం తీసుకుంటే, ప్రతి సంవత్సరం మీరు రూ.42,500 లాభం పొందుతారు - ఇది పాలసీ నిడివి అంతా చేరుతూ పోతుంది.
ఈ ప్లాన్ ముఖ్యంగా ఒకేసారి డబ్బు పెట్టి భద్రతగా ఉంచుకోవాలనుకునే వారికీ, మార్కెట్ రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునే వారికీ, పిల్లల భవిష్యత్తు, పెళ్లిళ్లు, లేదా రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్రణాళిక వేసుకునే వారికీ మంచి ఎంపికగా నిలుస్తుంది. ఎటువంటి సందేహం లేకుండా గ్యారంటీడ్ లాభాలను ఇవ్వడం, దీన్ని మరింత నమ్మదగినదిగా చేస్తోంది.
ఎవరికి ఉపయోగపడుతుంది?
1. చిన్న వయసులో ఉన్నవాళ్లకి ఇది బాగా సూటవుతుంది. ఎందుకంటే వారికీ టైమ్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడ ఎక్కువగా చేరతాయి.
2. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి చేసేవాళ్లకి ఇది మంచిగా పనిచేస్తుంది.
3. ఉద్యోగం స్టార్ట్ అయిన కొత్తవాళ్లు ఒక్కసారి కొంత డబ్బు పెడితే ఆతరువాత ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సిన ఒత్తిడి ఉండదు.
4. ఏ రెగ్యులర్ EMI లు, ప్రీమియం రిమైండర్లు లేకుండా ఉండే ప్రశాంతమైన సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.
ఎది ఉత్తమం?
నవ జీవన్ శ్రీ (912): నెలవారీ లేదా సంవత్సరానికి ప్రీమియం చెల్లించాలనుకునే, రెగ్యులర్ ఆదాయమున్న యువతకు ఇది ఉత్తమ ఎంపిక. దీర్ఘకాలికంగా పొదుపు, రక్షణ రెండూ కావాలనుకునే వారికి అనుకూలం.
నవ జీవన్ శ్రీ (911): ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలనుకునే వారికి, లేదా పెద్ద మొత్తం పెట్టుబడి నిర్మించాలనుకునే వారికి ఇది ఉత్తమం. ప్రీమియం ఒక్కసారి చెల్లిస్తే, పాలసీ కాలం మొత్తం రక్షణ, గ్యారంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. మీ అవసరాలు, పెట్టుబడి శక్తిని బట్టి ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
ట్యాక్స్ ప్రయోజనాల:
LIC తాజా పాలసీలకు సాధారణంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. అంటే, ఈ పాలసీలలో చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మీ ఆదాయపు పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. అలాగే, పాలసీ మేచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం కూడా పన్ను మినహాయింపుకు అర్హత పొందే అవకాశముంది (పరిస్థితులకు అనుగుణంగా).
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications