For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఎల్ఐసీలో వడ్డీ చాలా తక్కువ, ఇలా దరఖాస్తు చేయండి

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) వ్యక్తిగత రుణం వడ్డీ రేటు తక్కువగా ఉంది. LIC అతిపెద్ద బీమా కంపెనీ. ప్రజల కోసం ఇది అనేక పథకాలు, విధానాలను కలిగి ఉంది. పాలసీదారులు లోన్ సౌకర్యంతో పాటు పాలసీ కింద వివిధ ఆఫర్లు పొందుతారు. మీరు ఎల్ఐసీ పాలసీని కలిగి ఉంటే కనుక చాలా సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రభుత్వ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకుల కంటే కూడా తక్కువగా ఉంది. ఎల్ఐసీ పర్సనల్ లోన్ ప్రారంభ వడ్డీ రేటు కేవలం 9 శాతం మాత్రమే. రుణ కాలపరిమితి అయిదేళ్లు.

లోన్ మొత్తం పాలసీ సరెండర్ వ్యాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. తొంభై శాతం వరకు రుణం ఇస్తారు. మీ పాలసీ సరెండర్ వ్యాల్యూ రూ.5 లక్షలు అయితే రూ.4.5 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో అత్యంత ప్రయోజనకరమైన అంశం మీరు లోన్‌ను కాలపరిమితికి ముందే చెల్లిస్తే ఛార్జీలు సున్నా. అంటే రుణగ్రహీత నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే చెల్లిస్తే ముందస్తు చెల్లింపుల ఛార్జీలు ఉండవు. అంటే ప్రత్యేక ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. దీనిని ప్రిమెచ్యూర్ టెర్మినేషన్ ఛార్జీలు అంటారు.

ఎల్ఐసీ వడ్డీ రేటు అతి తక్కువ.. కానీ

ఎల్ఐసీ వడ్డీ రేటు అతి తక్కువ.. కానీ

సాధారణంగా ప్రయివేటు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వడ్డీ రేటు 10 శాతం కంటే ఎక్కువగానే ఉంది. కానీ ఎల్ఐసీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఎల్ఐసీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎంత ఉంటుందనే అంశం దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణ గ్రహీత ఆదాయం, ఏ రంగంలో ఉపాధి పొందుతున్నాడు, ఎంత రుణం తీసుకున్నారు, తిరిగి చెల్లించే కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి రుణ వడ్డీ రేటు ఉంటుంది.

అలా ప్రయోజనం

అలా ప్రయోజనం

రుణంపై వడ్డీ రేటు ఫ్లాట్ రేటు లేదా ఫ్లాట్ బ్యాలెన్స్ పద్ధతిన లెక్కిస్తారు. ఇందులో రుణం అసలు మొత్తం పైన వడ్డీ రేటు చెల్లించాలి. బ్యాలెన్స్ తగ్గింపు పద్ధతిన ఉంటుంది. రుణ బకాయి మొత్తం పైన వసూలు చేస్తారు. మీరు రుణ మొత్తంలో కొద్దిగా చెల్లిస్తే, మిగిలిన రుణ మొత్తానికి మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. మీరు రూ.5 లక్షలు తీసుకొని ఉంటే, అందులో రూ.2 లక్షలు తిరిగి చెల్లిస్తే మిగిలిన మొత్తానికి వడ్డీ వర్తిస్తుంది. అంటే రుణం తీసుకునే వ్యక్తి తగ్గింపు పద్ధతి ద్వారా ప్రయోజనం పొందుతారు.

ఈఎంఐ ఇలా

ఈఎంఐ ఇలా

ఒక వ్యక్తి 9 శాతం వడ్డీ రేటుతో రూ.1 లక్ష రుణం తీసుకుంటే ఏడాది కాలానికి రూ.8,745 ఈఎంఐ ఉంటుంది. రెండేళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.4,568, మూడేళ్ళ కాలమైతే రూ.3,180, నాలుగేళ్ల కాలమైతే రూ.2,489, అయిదేళ్లు అయితే రూ.2,076 అవుతుంది. అలాగే రూ.5 లక్షల రుణం తీసుకుంటే రెండేళ్ల కాలానికి రూ.23,304, మూడేళ్ళ కాలమైతే రూ.18,472, నాలుగేళ్ల కాలమైతే రూ.12,917, అయిదేళ్లు అయితే రూ.15,000 అవుతుంది.

దరఖాస్తు ఎలా?

దరఖాస్తు ఎలా?

- LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- హోమ్ పేజీ ఓపెన్ అయ్యాక స్క్రీన్‌పై కనిపించే ఆన్‌లైన్ సర్వీస్ (ఎడమవైపు) కింద ఉన్న Online Loan పైన క్లిక్ చేయాలి.

- Online Loan పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో లోన్ రీపేమెంట్, ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్‌ ఉంటాయి.

- ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని టైప్ చేయాలి.

- ఆ తర్వాత మీ పాలసీ నెంబర్‌కు మీ బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేస్తే రుణ మొత్తం సదరు అకౌంట్‌లో జమ అవుతుంది.

English summary

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఎల్ఐసీలో వడ్డీ చాలా తక్కువ, ఇలా దరఖాస్తు చేయండి | LIC Personal Loan is available at low interest rate, know how to apply

LIC is the largest reputed insurance company of India. It has several schemes and policies for the people. Those policyholders get different offers under the policies including a loan facility. If you have a LIC policy, you can easily take a personal loan. Its interest rate is much lower than that of government or private banks. LIC’s interest rate on personal loan starts from 9 percent.
Story first published: Sunday, December 12, 2021, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X