మీ దగ్గర డబ్బులు ఉన్నాయా..? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా... అయితే ఇంకెందుకు ఆలస్యం. మీరు చేస్తున్న డబ్బులకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు ఎంతో సురక్షితం మీ డబ్బులకు గ్యారెంటీ ఇస్తోన్న ఎల్‌ఐసీని ఆశ్రయించండి. లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లిండం ద్వారా భారీ మొత్తాన్ని రిటర్న్స్ రూపంలో పొందొచ్చు. అలాంటి ప్లాన్స్‌లో ఒకటి జీవన్ ప్రగతి పాలసీ. ఈ ప్లాన్ తీసుకున్న వారు లేదా ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు నెలవారీగా చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థికంగా భద్రతాపరమైన భవిష్యత్తును పొందొచ్చు. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 28 లక్షలు పొందుతారు. ఇక జీవన్ ప్రగతి పాలసీ గురించి ఒక సారి తెలుసుకుందాం...

రోజుకు రూ.200 ఖర్చుతో...
ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి పాలసీ కింద రూ. 28 లక్షలు పొందేందుకుగాను ముందుగా నెలకు రూ.6వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 200గా ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుందన్న విషయం మరవరాదు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్‌కు డెత్ రిస్క్ కవర్ కూడా అందిస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) నిర్దేశించిన నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ పాలసీ ఉంటుంది.

నామినీకి బోనస్
ఒకవేల పాలసీదారుడు మరణిస్తే నామినీకి మెచ్యూరిటీపై వచ్చే మొత్తం లభిస్తుంది. జీవన్ ప్రగతి ప్లాన్ తీసుకున్న పాలసీదారుడు మరణించినా... ఆతర్వాత నామినీకి కూడా బోనస్ వస్తుంది. ఇక ఈ పాలసీ 12 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల వయసున్నవారు తీసుకునేందుకు అర్హులు.

పాలసీ కనీసం 12 ఏళ్లు..
ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీని తీసుకోవాలనుకునే వారు కనీసం 12 సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఈ పాలసీ మెచ్యూరిటీ పై రూ.15వేలు పెన్షన్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, అంగవైకల్యం చెందినా పాలసీదారుడికి పలు ప్రయోజనాలు చేకూరేలా ప్లాన్‌ను రూపొందించడం జరిగింది. అయితే దీనికోసం ప్రత్యేకమైన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి ఐదు సంవత్సరాలకు..
ప్రతి ఐదు సంవత్సరాల తర్వాత ఈ పాలసీలో రిస్క్ కవర్ పెరుగుతుంది. పెట్టుబడి పెట్టిన తర్వాత మొదటి ఐదేళ్ల బీమా మొత్తం అలాగే ఉంటుంది. కానీ 6 నుండి 10 సంవత్సరాల వరకు బీమా మొత్తం 25% నుండి 125% కి పెరుగుతుంది. 11 నుంచి 15 సంవత్సరాల మధ్య బీమా మొత్తం 150% కి పెరుగుతుంది. మీరు 20 సంవత్సరాల పాటు డబ్బును ఉపసంహరించుకోకపోతే, బీమా మొత్తం 200%కి పెరుగుతుంది.

రూ. 2 లక్షల పాలసీ తీసుకుంటే..
ఉదాహరణకు మీరు రూ. 2లక్షల పాలసీ తీసుకుంటే మొదటి ఐదేళ్లలో డెత్ కవరేజ్ మామూలుగానే ఉంటుంది. ఇక ఆరు నుంచి 10 సంవత్సరాల వరకు కవరేజ్ రూ. 2.5 లక్షలకు పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు 10 నుంచి 15 ఏళ్ల మధ్యలో మరణిస్తే డెత్ కవరేజ్ రూ.3 లక్షలకు పెరుగుతుంది. పాలసీ తీసుకున్న తర్వాత 16 నుంచి 20 సంవత్సరాల మధ్య పాలసీదారుడు మృతి చెందితే అతని కుటుంబానికి డెత్ కవరేజ్ కింద రూ.4 లక్షలు అందజేయడం జరుగుతుంది. ఇక ఇలాంటిదే మరో ప్లాన్ కూడా ఉంది. దీనిపేరే ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్. ఈ ప్లాన్ కింద రోజుకు రూ.233 పెట్టుబడి పెడితే మీరు మొత్తం 20 ఏళ్లకు గాను రూ.17.13 లక్షలు డిపాజిట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా రిటర్న్స్ పొందుతారు.
ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయండి. మంచి భవిష్యత్తుకు పునాది వేయండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications