జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ఈ త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఎల్ఐసీ భారత అతిపెద్ద బీమా సంస్థ మాత్రమే కాదు. దీని పాలసీ ఆఫర్లలో కోట్లాది మంది చేరడంతంతో ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా మారింది. ఎల్ఐసీ అత్యంత విజయవంతమైన ఐపీవో అవుతుందని భావిస్తున్నారు. రిటైల్ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేస్తుంది. ఇందుకు ఇష్యూ పరిమాణంలో పది శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేర్ ధరలో 5 శాతం నుండి 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్ఐసీలో వాటాదారులుగా మారడంతో పాటు రాయితీలో షేర్లను దక్కించుకోవచ్చు.

పాలసీదారులకు విండో
ఎల్ఐసీ ఐపీవో కోసం డీఆర్‌హెచ్‌పీ అని పిలువబడే ఆఫర్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఈ వారంలో దాఖలు చేయనుంది. రిటైల్ విండో కింద నిర్దిష్ట రిజర్వేషన్ ఉందని, పాలసీదారులకు విండో ఉంటుందని తెలిపారు. పాలసీదారులకు పోటీ ప్రాతిపదికన కొంత తగ్గింపుతో ఇష్యూలో 10 శాతం వరకు అందించవచ్చునని ఎల్ఐసీ చట్టం కింద తాము నిబంధనలు రూపొందించామని, ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ ఉంటుందని దీపమ్ సెక్రటరీ వెల్లడించారు.

ఉద్యోగులకు కూడా తగ్గింపు ఉండవచ్చు
ఎల్ఐసీ ఐపీవోలో కేవలం పాలసీదారులకే కాకుండా ఉద్యోగులు, రిటైల్ పెట్టుబడిదారులకు కూడా కొంత తగ్గింపుతో ఉంటుందని చెబుతున్నారు. అయితే దీపమ్ కార్యదర్శి పాలసీదారులకు డిస్కౌంట్ అందించే అవకాశాలను మాత్రమే ధృవీకరించారు. ఇలాంటి డిస్కౌంట్స్ చిన్న పెట్టుబడిదారుల నుండి ఆసక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటాయి. తాజా ఇష్యూ పరిమాణం ఐదు శాతం నుండి 10 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా.

ఐపీవో దరఖాస్తు కోసం ఇలా..
ఎల్ఐసీ పాలసీదారులు అయితే ఐపీవోలో పాల్గొనడానికి ఇలా చేయాలి. మీ పాన్ నెంబర్‌ను ఎల్ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే పాలసీకి ఆధార్ నెంబర్‌ను కూడా జత చేయడం ద్వారా ఎల్ఐసీ ఆన్ లైన్ వెబ్ సైట్‌లో అనేక ట్రాన్సాక్షన్స్ చేయడానికి సులభమవుతుంది. సాధారణంగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవడానికి పాన్ కార్డు తప్పనిసరి కాదు. కానీ ఎల్ఐసీ తన పాలసీదారులకు షేర్లను కేటాయించేందుకు దీనిని ప్రామాణికంగా తీసుకుంటుంది కాబట్టి అవసరం.
పాన్ కార్డు నమోదు చేయడానికి ముందుగా ఎల్ఐసీ అధీకృత వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
అక్కడి ఆన్ లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అనే లింక్ కనిపిస్తుంది.
ఆ లింక్ పైన క్లిక్ చేసి, అక్కడి సమాచారాన్ని చదవాలి.
అడిగిన వివరాలు నమోదు చేయాలి.
ఓటీపీ ద్వారా వాటిని అధీకృతం చేయాలి.
ఆ తర్వాత మీ పాలసీ-పాన్ అనుసంధానం అయిందా లేదా చూసుకోవడానికి అక్కడే ఏర్పాటు ఉంటుంది.
దీని కంటే ముందు ఎల్ఐసీ వెబ్ సైట్‌లో మీ పాలసీ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ యూజర్ ఖాతాను సృష్టించుకోవాలి. దీంతో ఈ పని సులువు అవుతుంది.
ఐపీవో షేర్ల కొనుగోలుకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications