అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మెగా పబ్లిక్ ఇష్యూ నేడు (మే 4, 2022) ప్రారంభమవుతోంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి భారీ స్పందన వచ్చింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్న వారు ఆసక్తిని చూపిస్తున్నారు. ఐపీవో ధరల శ్రేణి రూ.902 నుండి 949గా ప్రకటించారు. పాలసీదారులకు 60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్ ఉంది.

ధరల శ్రేణి, షేర్ల జారీ
రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, పాలసీదారులు బుధవారం నుండి ఎల్ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.902-949 ధరల శ్రేణితో జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ 9వ తేదీన ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ మొత్తం 22.13 కోట్ల షేర్లు జారీ చేస్తోంది. ఇందులో 9.88 కోట్ల షేర్లు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 2.6 కోట్ల షేర్లు నాన్-ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 15,81,249 షేర్లు ఉద్యోగులకు, 2,21,37,492 షేర్లు పాలసీదారులకు కేటాయించింది. ఈ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ 3.5 శాతం వాటాను విక్రయించి, రూ.21,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 17వ తేదీన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు కానుంది.

దీర్ఘకాలానికి...
30 కోట్ల వరకు పాలసీదారులు, 13 లక్షలకు పైగా ఏజెంట్లు ఉన్నారు. బీమా ప్రీమియంలో 64 శాతం వాటాను కలిగి ఉంది. 2019-20లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్ రికార్డ్ సృష్టించింది. ఎల్ఐసీకి రూ.3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది. ఈ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చునని, కానీ దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలని, ఎందుకంటే ఏడాది తర్వాత మరోసారి వాటా విక్రయం ఉండే అవకాశముందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

వీటిని పరిగణలోకి తీసుకోవాలి
ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేయవచ్చునని బ్రోకరేజీ సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని, ప్రయివేటు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడితో ఎల్ఐసీ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతోందని గుర్తు చేస్తున్నారు. ఎల్ఐసీ పాలసీలు సంప్రదాయ ఏజెంట్ పద్ధతిలోనే ఎక్కువగా ఉన్నాయని, రెన్యూవల్ ప్రీమియంలు మాత్రమే 36 శాతం డిజిటల్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ప్రయివేటు బీమా సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications