లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ మార్చి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఈ మేరకు మార్కెట్‌లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.2000 నుండి రూ.2100 వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ షేర్ వ్యాల్యూతో రూ.65,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించవచ్చునని భావిస్తున్నారు. దేశంలో అతిపెద్ద ఐపీవో కోసం ఆదివారం ఎల్ఐసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్‌ను దాఖలు చేసింది. అయితే ఇష్యూ తేదీపై వచ్చిన వార్తలను ఖండించింది. ఆ తర్వాత పెట్టుబడిదారులతో రోడ్ షోల తర్వాత వ్యాల్యుయేషన్ పైన ఏదైనా నిర్ణయం తీసుకొని, మార్చిలో లిస్టింగ్‌కు వస్తుందని భావిస్తున్నారు.

మొదటిసారి పెట్టుబడులు
ఎల్ఐసీకి 283 మిలియన్ల పాలసీదారులు ఉన్నారు. వీరికి 3.16 కోట్ల షేర్లను రిజర్వ్ చేసే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎల్ఐసీ 1.35 మిలియన్ల రిజిస్టర్డ్ ఏజెంట్లతో దేశంలోని అతిపెద్ద నెట్ వర్క్‌ను కలిగి ఉంది. పది శాతం డిస్కౌంట్‌తో ఎల్ఐసీ తమ పాలసీదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే చాలామంది పాలసీదారులు ఈక్విటీలలో మొదటిసారి పెట్టుబడిదారులుగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఎల్ఐసీ ఇష్యూ తేదీ ఇతర వివరాలు...
Issue Opens: March 10
Issue Closes: March 14
Issue Price: Rs 2,000-2,100 per share
Issue Size: 31,62,49,885 shares
Offer for-Sale: 31,62,49,885 షేర్లు. వీటి వ్యాల్యూ రూ.65,416.29 కోట్లు.
Discount: ఉద్యోగులకు, పాలసీహోల్డర్లకు 10% రాయితీ
Price Band Announcement: March 7
Anchor Investors Allotment: March 9
Market Lot: Seven shares
Employees: 1.58 crore shares (10 percent discount = Rs 1,890)
Policyholders: 3.16 crore shares (10 percent discount = Rs 1,890)
Anchor: 8.06 crore shares = Rs 16,935.18 crore
Qualified Institutional Bidder: 5.37 crore shares = 11,290.12 crore
Non-Institutional Investors: 4.03 crore shares = 8,467.59 crore
Retail Individual Investor: 9.41 crore shares = 19,757.71 crore
Listed Peers: SBI లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, HDFC లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ.

వంద శాతం వాటా
ఎల్ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. ఇందులో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను ఐపీవో ద్వారా విక్రయిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.78 వేల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూ రూ.5.4 లక్షల కోట్లుగా అంతర్జాతీయ సంస్థ మిల్లీమన్ అడ్వైజర్స్ నిర్ధారించింది.
ఎల్ఐసీ ఐపీవో ఇష్యూలో పాలసీదారులకు 10 శాతం, ఉద్యోగులకు 5 శాతం కేటాయిస్తారు.
ఐపీవోలో పాల్గొనేందుకు పాలసీదారులు తమ పాన్ నెంబర్‌ను ఎల్ఐసీ పాలసీ ఖాతాకు అనుసంధానం చేయాలి. డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి.
ఐపీవో తర్వాత మార్కెట్ వ్యాల్యూ రూ.22.1 లక్షల కోట్లు అవుతుందని అంచనా.
1956లో ఎల్ఐసీ ఏర్పడింది. 245 కంపెనీలు విలీనం చేసి సెప్టెంబర్ 1న జాతీయీకరణ చేశారు. రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటయింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications