కొత్త ఏడాదిలో ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి చెందిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) శుభవార్త చెప్పింది. హోమ్ లోన్స్ పైన తక్కువ వడ్డీ రేటుకో రుణాలు అందుబాటులో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. LIC HFL ఇప్పుడు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు తగ్గించింది.

8.1 శాతం వడ్డీకే 30 ఏళ్ల టెన్యూర్
- LIC హౌసింగ్ ఫైనాన్స్ గృహ సిద్ధి పేరుతో 8.1 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తోంది.
- ఈ లోన్ చెల్లించేందుకు 30 ఏళ్ల సమయం ఇస్తుంది. అలాగే, రుణ గ్రహీతకు 60 ఏళ్లు వచ్చే వరకు కూడా లోన్ టెన్యూర్ నిర్ణయించుకోవచ్చు. ఇందులో ఏది ముందు వస్తే ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

మహిళలకు మరింత తక్కువ వడ్డీ, ప్రీపేమెంట్ పెనాల్టీ లేదు
- LIC హౌసింగ్ ఫైనాన్స్ గృహ సిద్ధిలో మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే వారికి వడ్డీ రేటు మరింతగా తగ్గుతుంది.
- మీ చేతికి డబ్బు వచ్చి ముందే లోన్ మొత్తం చెల్లించాలనుకున్నా మంచి వెసులుబాటు ఉంది. ఎలాంటి ప్రీ పేమెంట్ పెనాల్టీ లేదు.
- ఇంటి మరమ్మతుల కోసం లేదా కొత్త ఇల్లు కొనుగోలుకు లేదా నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం హోమ్ లోన్ తీసుకోవచ్చు.
- కనీసం రూ.1,00,000 తీసుకోవచ్చు.

ఎంత మొత్తం ఇస్తారంటే?
- గృహ సిద్ధిలో రూ.20 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే ప్రాపర్టీ పైన 85 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య తీసుకుంటే 80 శాతం, రూ.75 లక్షలకు పైన తీసుకుంటే 75 శాతం లోన్ అమౌంట్ వస్తుంది.
- శాలరైడ్‌కు గరిష్ట కాలపరిమితి 30 ఏళ్లు. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కు 20 ఏళ్లు.
- 27 డిసెంబర్ 2019 నాటికి రూ.419,027 కోట్ల విలువ కలిగిన హోమ్ లోన్ అప్లికేషన్స్ దీనికి వచ్చాయి.

LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఇతర డిటైల్స్ కొన్ని
- LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో వడ్డీ రేట్లు 8.10 శాతం నుంచి 8.95 శాతం మధ్య ఉన్నాయి.
- ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం ఉంటుంది లేదా రూ.10,000 కనిష్టం. గరిష్టం రూ.25,000. వీటికి జీఎస్టీ అదనం.
- రూ.30 లక్షలు వరకు హోమ్ లోన్ తీసుకుంటే ప్రాపర్టీ వ్యాల్యూలో 90 శాతం ఇస్తారు.
- రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య అయితే ప్రాపర్టీ వ్యాల్యూలో 80 శాతం లోన్ ఇస్తారు.
- రూ.75 లక్షలకు పైన అయితే ప్రాపర్టీ వ్యాల్యూలో 75 శాతం లోన్ ఇస్తారు.
- అతి తక్కువ ఈఎంఐ 30 ఏళ్లకు రూ.1 లక్షకు రూ.741గా ఉంది.
- కనీస ఆదాయం రూ.25,000 ఉండాలి.
- లోన్ రీపేమెంట్ సమయం 3 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు

SBIలో డిసెంబర్ 31 వరకు అద్భుత అవకాశం!
ఇదిలా ఉండగా ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను ఇటీవల తగ్గించింది. SBI వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమవుతోంది. 2019 చివరి నాటికి (డిసెంబర్ 31 లోపు) బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకుంటే జనవరి నుంచి వడ్డీ రేటు 7.9 శాతం మాత్రమే వర్తిస్తుంది. రుణాలపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలు లేకపోవడం వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications