ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) నుంచి శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) బంపరాఫర్ ప్రకటించింది. సంక్రాంతి పర్వదినం రోజున (15 జనవరి 2020) '2020 హోమ్ లోన్ ఆఫర్'ను ప్రకటించింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో ఎల్ఐసీ మంచి ఆఫర్ ఇస్తోంది.

పే వెన్ యు స్టే
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా హౌసింగ్ అండర్ కన్స్ట్రక్షన్, రెడీ టూ మూవ్ ఆస్తుల కొనుగులుపై ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకున్న హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనకరం. పే వెన్ యు స్టే బ్రాండుతో దీనిని అందిస్తున్నారు. అంటే మీరు ఇంట్లోకి వెళ్లిన తర్వాతే ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించాలి.

ఆ తర్వాతే ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లింపు
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసే రుణగ్రహీతలకు గృహ ప్రవేశం వరకు లేదా తొలి విడత రుణ నిధుల జారీ నుంచి 48 నెలల పాటు ఏది ముందు అయితే దాని ప్రకారం అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. విడుదల చేసిన రుణ నిధులపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

ఈఎంఐ చెల్లింపులకు మినహాయింపు
నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లోని ఇంటిని కొనుగోలు చేసే రుణగ్రహీతలకు ఆరు నెలల EMI చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తోంది. రుణ కాలపరిమితిలో 5, 10, 15వ సంవత్సరాలలో రెండు చొప్పున EMI చెల్లింపులకు మినహాయింపు లభిస్తుంది.

పరిమిత కాల ఆఫర్
సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిపే వారికి, మొదటి అయిదేళ్ల వరకు ఎలాంటి ముందస్తు చెల్లింపులు జరపని వారికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. ఈ పరిమితకాల ఆఫర్ జనవరి 29 వరకు అందుబాటులో ఉంటుంది. మార్చి 15వ తేదీలోగా రుణం జారీ కావాల్సి ఉంటుంది.

రుణగ్రహీతలకు ప్రయోజనం
బుధవారం ఈ స్కీం లాంఛ్ సందర్భంగా LICHFL మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో సిద్ధార్థ మొహంతీ మాట్లాడారు. అండర్ కన్స్ట్రక్షన్ హౌస్‌లు కొనుగోలు చేసిన వారు లేదా రెడీ టూ హోమ్ కొనుగోలు చేసిన వారు.. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత పే చేయవచ్చునని చెప్పారు. దీని వల్ల నెలవారీ ఈఎంఐ బరువు తగ్గుతుందన్నారు. ప్రిన్సిపల్ పేమెంట్ పైన 48 నెలల వరకు ఊరట ఉంటుందన్నారు. ఆరు ఈఎంఐల మినహాయింపు రుణగ్రహీతలకు ప్రయోజనం అన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే కేంద్రం నినాదానికి అనుగుణంగా తాము పని చేస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications