ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అదిరిపోయే ఆఫర్, అతి తక్కువ వడ్డీ రేటు రూ.2 కోట్ల వరకు..

మోర్టగేజ్ ఫైనాన్షియర్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(LIC HFL) రూ.2 కోట్ల వరకు హోమ్ లోన్స్ పైన తక్కువ వడ్డీరేటు(6.66 శాతం)ను పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారికి రూ.50 లక్షల వరకు మొత్తంపై హోమ్ లోన్ వడ్డీ రేటును 6.66 శాతానికి వర్తింప చేస్తూ జూలైలో ప్రకటన చేసింది. 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఉద్యోగులకు లేదా ప్రొఫెషనల్స్‌కు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2021 సెప్టెంబర్ 22వ తేదీ నుండి 2021 నవంబర్ 30వ తేదీ మధ్య మంజూరు చేసిన రుణాలకు ఇది వర్తిస్తుందని, మొదటి పంపిణీ 2021 డిసెంబర్ 31న లేదా అంతకంటే ముందు ఉంటుందని తెలిపింది.

సిబిల్ స్కోర్ 700 దాటాలి

సిబిల్ స్కోర్ 700 దాటాలి

ఎల్ఐసీ హెచ్‌ఎఫ్ఎల్ జూలై నెలలో రూ.50 లక్షల హోమ్ లోన్ వరకు 6.66 శాతం వడ్డీ రేటును అందించిందని, ఇప్పుడు దీనిని రూ.2 కోట్లకు పొడిగించిందని హోమ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో వై విశ్వనాథ్ గౌడ్ అన్నారు. సిబిల్ స్కోర్ 700 అంతకంటే ఎక్కువగా ఉంటే స్పెషల్ వడ్డీ రేటు వర్తిస్తుందని చెప్పారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజా నిర్ణయం డిమాండ్ పెరగడానికి, అలాగే హోమ్ లోన్ తీసుకునే వారికి తక్కువ ధరకు లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ప్రాసేసింగ్ ఫీజు రుణ మొత్తంపై గరిష్టంగా రూ.10,000 లేదా 0.25 శాతంగా ఉంది. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణంపై ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ గృహవరిష్ట స్పెషల్ స్కీమ్ సహా అన్ని హోమ్ లోన్స్ పైన 6.66 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

అద్బుతమైన గృహవరిష్ట స్కీం

అద్బుతమైన గృహవరిష్ట స్కీం

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇంటి కొనుగోలుదారుల కోసం కొద్ది నెలల క్రితం గృహవరిష్ట పేరుతో హౌసింగ్ లోన్ ప్లాన్‌ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. 6 EMIల మాఫీ సదుపాయంతో గృహవరిష్ట మార్టగేజ్ గృహరుణాన్ని కొత్తగా తీసుకు వచ్చింది. డిఫైన్డ్ బెనిఫిట్ పెనన్షన్ స్కీమ్ (DBPS) పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్ల కోసం దీనిని రూపొందించింది. హోమ్ లోన్ చెల్లింపులు జరుగుతున్న కాలంలో 37, 38, 73, 74, 121, 122 EMIలు మాఫీ చేసి అప్పటికి రుణగ్రహీత చెల్లించాల్సిన ప్రిన్సిపల్‌లో సద్దుబాటు చేస్తారు. 65 సంవత్సరాల లోపు వారు దీనికి అర్హులు. ప్రత్యేక లక్షణాల కారణంగా గృహవరిష్టను జూలై 2020లో ప్రారంభించినప్పటి నుండి చాలామందిని ఆకట్టుకుంది. గృహవరిష్ట స్కీంకు అర్హత 65 ఏళ్ల లోపు. లోన్ టెన్యూర్ 80 ఏళ్ల వరకు లేదా గరిష్టంగా 30 ఏళ్లు. అధిక హోమ్ లోన్ కోసం జాయింట్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వరుసగా తగ్గింపు

వరుసగా తగ్గింపు

హోమ్ లోన్ లేదా రియాల్టీ మార్కెట్ పుంజుకునే విధంగా ఇటీవల వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేటు పైన వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎస్బీఐ వంటి పలు బ్యాంకులు హోమ్ లోన్ పైన 6.7 శాతం నుండి వడ్డీ రేటు ప్రారంభమవుతోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులు పండుగ ఆఫర్ కింద హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి... తగ్గిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువ ఉంటే రూ.75 లక్షలకు పైన ఉన్న హోమ్ లోన్ పైన రుణ గ్రహీతలకు 40 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మధ్య వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఇలా.. పలు బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని, దీనికి తోడు PMAY కింద సబ్సిడీ వస్తోందని, పన్ను ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని పరిగణలోకి తీసుకుంటే తక్కువ ధరకే ఇంటిని కొనుగోలు చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+