Emergency Fund: అత్యవసర నిధిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..!
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించ లేరు. అందుకే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. అలాగే వైద్య ఖర్చులు తగ్గించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెబుతుంటారు. టర్మ్, హెల్త్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పాలసీలు. అయితే జీవితంలో అప్పుడప్పుడు ఊహించిన పరిణామాలు జరుగుతాయి. అప్పుడు భారీగా డబ్బు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తుంది. దాని కోసం అత్యవసర ఫండ్ ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంక్షోభ సమయంలో తక్షణ ఆర్థిక సహాయం అందించడమే అత్యవసర నిధి ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొంటున్నారు.
వైద్య ఖర్చులు, ప్రమాదాలు, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక అత్యవసర పరిస్థితుల వంటి ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి తక్షణమే అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ ను పార్క్ చేయాల్సి ఉంటుంది. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ద్రవ్య లభ్యత, మూలధన భద్రత(పెట్టుబడి పెట్టిన సొమ్ము). సహేతుకమైన రాబడులను సమతుల్యం చేసుకోవాలి. అత్యవసర నిధి కోసం రూ.5 లక్షల వరకు ఉంటే సరిపోతుదని సూచిస్తున్నారు. అయితే రూ.5 లక్షలను ఎక్కడా పెట్టుబడి పెడితే సొమ్మును వెంటనే ఉపసంహరించుకునేలా చూసుకోవాలి.

ఇందుకోసం పొదుపు ఖాతాలు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లు పరిశీలించాలి. ఇవి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. బ్యాంకు పొదుపు ఖాతాల కంటే బ్యాంకు FDలు అధిక రాబడులను అందించగలవు. ఉదాహరణకు అనేక ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎంపిక చేసిన FD కాలపరిమితులపై 8 శఆతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
మరోవైపు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లు ప్రధానంగా స్వల్పకాలిక డెట్, మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెడతాయి, అందువల్ల ఇవి సాపేక్షంగా తక్కువ-నష్టభయం గల పెట్టుబడి ఎంపికలుగా ఉన్నాయి
అయినప్పటికీ అవి పూర్తిగా నష్టభయం లేనివి కావు. రాబడులు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఒక అత్యవసర నిధి రాబడుల కంటే ద్రవ్యత, మూలధన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు రూ.5 లక్షల నిధిలో తక్షణ అవసరాల కోసం పొదుపు ఖాతాలో రూ.1 లక్ష, కచ్చితమైన రాబడుల కోసం ఎఫ్‌డీలో రూ.2 లక్షలు, సులభంగా డబ్బు తీసుకోవడానికి, అధిక రాబడినిచ్చే సామర్థ్యం కోసం లిక్విడ్ ఫండ్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ కేటాయింపు మీ నెలవారీ ఖర్చులు, ఆదాయ స్థిరత్వంపై ఆధారపడి ఉండాలి. అదే సమయంలో అవసరమైనప్పుడు మీరు డబ్బును తీసుకునేలా ఉండాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications