HDFC Bank FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..!
ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. నవంబర్ 4 నుంచి సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. కొన్ని నిర్దిష్ట కాలపరిమితులపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంచారు. ఈ మార్పుల తర్వాత, సీనియర్ సిటిజన్లు 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.20 శాతం వడ్డీని పొందవచ్చు. సాధారణ కస్టమర్లు 3 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై గరిష్టంగా 6.60 శాతం వడ్డీని పొందవచ్చు.
60 రోజుల వరకు కాలపరిమితి గల ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. 61 రోజుల నుంచి 6 నెలల కాలపరిమితి గల ఎఫ్డీలపై వడ్డీ రేటును గతంలో ఉన్న 4.25% నుంచి 4.75 శాతానికి పెంచింది ( 50 బేసిస్ పాయింట్ల పెంచింది). సాధారణ కస్టమర్ల విషయానికి వస్తే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.65 శాతం నుంచి 6.60 శాతానికి సవరించారు. బ్యాంక్ పలు కాలపరిమితులపై వడ్డీ రేట్లను పెంచగా, ప్రస్తుతం గరిష్ట వడ్డీ రేటు 7.20 శాతంగా ఉంది. 61 రోజుల నుంచి 6 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు 5.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇది గతంలో ఉన్న 4.75 శాతం కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ.

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేటు 7.20%గా ఉంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.65 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది. 61-89 రోజుల డిపాజిట్లపై 4.25 నుంచి 4.75 శాతానికి సవరించింది. 90 రోజుల నుంచి 6 నెలల వరకు గల డిపాజిట్లపై 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు డిపాజిట్లపై 5.50 నుంచి 5.65 శాతం వరకు సవరించింది. 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం లోపు వరకు గల డిపాజిట్లపై 5.75 శాతం నుంచి
5.90 శాతానికి పెంచింది.
18 నెలల నుండి 21 నెలల లోపు వరకు గల డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. 21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు గల డిపాజిట్లపై 6.45 నుంచి 6.50 శాతానికి వడ్డీ రేట్లు సవరించింది. 2 సంవత్సరాల 1 రోజు నుంచి 2 సంవత్సరాల 11 నెలల లోపు వరకు గల డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.55 శాతం వరకు పెంచింది. 2 సంవత్సరాల 11 నెలలు (35 నెలలు) గల డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.55 శాతానికి సవరించింది. 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు గల డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.55 శాతానికి పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు వరకు గల డిపాజిట్లపై 6.50 శాతం నుంచి 6.60 శాతానికి పెంచింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications