Shriram Finance: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన శ్రీరామ్ ఫైనాన్స్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఎన్బీఎఫ్సీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచగా.. తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్ వివిధ కాలపరిమితులు కలిగిన తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు అక్టోబర్ 11, 2026 నుం అమల్లోకి రానున్నాయి. రూ.10 కోట్ల వరకు ఉన్న డిపాజిట్ల విషయంలో 12 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 6.85 శాతం నుంచి 7శాతానికి పెరిగింది. 15 నెలల డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును 7.1 శాతం నుంచి 7.5 శాతాని పెంచారు.
18-23 నెలల కాలపరిమితికి వడ్డీ రేటు 7.05 శాతం నుంచి 7.25 శాతం పెరగ్గా.. 24-35 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.1%కి నుంచి7.5% వడ్డీ పెంచారు. అలాగే, 36-60 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 7.5 శాతం నుంచి 7.85 శాతానికి పెంచారు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు కంపెనీ అదనంగా ఏడాదికి 0.50 శాతం పాయింట్ల వడ్డీని చెల్లిస్తోంది. మహిళా డిపాజిటర్లకు అదనంగా 0.05 శాతం అదనంగా వడ్డీ లభించనుంది. గడువు ముగిసిన డిపాజిట్లను పునరుద్ధరించే కస్టమర్లు అదనంగా 0.15 శాతం పాయింట్ల ప్రయోజనానికి అర్హత పొందన్నారు.

60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు కంపెనీ అదనంగా ఏడాదికి 0.50 శాతం పాయింట్ల వడ్డీని అందిస్తోంది. మహిళా డిపాజిటర్లకు అదనంగా 0.05 శాతం పాయింట్లు లభిస్తాయి, అలాగే గడువు ముగిసిన డిపాజిట్లను పునరుద్ధరించే కస్టమర్లు అదనంగా 0.15 శాతం పాయింట్ల ప్రయోజనానికి అర్హులవుతారు. శ్రీరామ్ ఫైనాన్స్ తన 'ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (FIP) కింద వడ్డీ రేట్లను సవరించింది. ఇవి అక్టోబర్ 11, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. 12-23 నెలల కాలపరిమితికి వడ్డీ రేటు 6.85% నుంచి 7%కి, 24-35 నెలలకు 7.1% నుంచి 7.5%కి, 36-48 నెలలకు 7.5% నుంచి 7.85%కి పెరిగింది.
ఈ ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద మహిళా డిపాజిటర్లకు ఏటా అదనంగా 0.05 శాతం పాయింట్ల వడ్డీ లభించడం కొనసాగుతుంది. అలాగే ఇతర నిబంధనలు, షరతులలో ఎటువంటి మార్పు లేదని శ్రీరామ్ ఫైనాన్స్ పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications