కస్టమర్లకు SBI హెచ్చరిక, KYC ఫ్రాడ్ పట్ల జాగ్రత్త
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు KYC ఫ్రాడ్ గురించి హెచ్చరికలను జారీ చేసింది. KYC పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మీకు KYC ఏమైనా కాల్స్ లేదా సందేశాలు వస్తే వాటి గురించి సైబర్ క్రైమ్‌కు తెలియజేయాలని కోరింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. SBI KYC పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తిస్తోందని, అలాంటి మోసగాళ్లు ఎస్బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎలాంటి లింక్స్ పైన క్లిక్ చేయవద్దని కోరింది.

KYC అప్ డేట్ మోసం
KYC ఫ్రాడ్‌స్టర్స్ వివిధ లింక్స్ పంపించడం, KYCని అప్ డేట్ చేయమని అడగడం చేస్తారని, తద్వారా మిమ్మల్ని మోసం చేస్తారని ఎస్బీఐ పేర్కొంది. ఇలాంటి అపరిచిత సందేశాలు మీకు వస్తే వెంటనే సైబర్ క్రైమ్‌కు నివేదించాలని సూచించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ వెబ్ సైట్ http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని తెలిపింది.
ఈ కరోనా కాలంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దని ఎస్బీఐ తెలిపింది. అలాగే ఎస్బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను కోరింది.

కొన్ని టిప్స్
- అపరిచిత వ్యక్తుల నుండి ఎస్సెమ్మెస్, ఈ మెయిల్స్ రూపంలో వచ్చే లింక్స్ పైన క్లిక్ చేయవద్దు.
- టెలిఫోన్ కాల్స్, ఈ-మెయిల్ సోర్స్ ద్వారా వచ్చే ఎలాంటి మొబైల్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేయవద్దు.
- ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, డెబిట్ కార్డు నెంబర్, పిన్, CVV, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ వంటి వాటిని షేర్ చేయవద్దు.

ఫ్రాడ్స్
ఎస్బీఐ ఎప్పుడు కూడా కేవైసీ అప్ డేట్ కోసం లింక్స్‌ను పంపించదని స్పష్టం చేసింది. ఫేక్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాగా, కరోనా సమయంలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కూడా పెరిగిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ ఫ్రాడ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications