కరోనా నేపథ్యంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. చాలా బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు దశాబ్దాల కనిష్టం 6.7 శాతానికి తగ్గించాయి. అయితే హోమ్ లోన్ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. ఇందుకు ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు మొదటి అడుగు వేసింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు హోమ్ లోన్ డిమాండ్ కోసం వడ్డీ రేట్లను తగ్గించాయి.
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్టానికి తగ్గించడంతో బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేశాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో ఆర్థిక రికవరీ కనిపించడంతో క్రమంగా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభిస్తున్నాయి.

హోమ్ లోన్ వడ్డీ రేటు స్వల్ప పెరుగుదల
కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 10వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.కొత్త వడ్డీ రేటు 0.05 శాతం మేర పెరిగింది. వడ్డీరేట్ల పెంపుకు అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ గృహ రుణ రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. వచ్చే నెల పదో తేదీ నుండి ఇది 6.55 శాతానికి పెరుగుతుంది.
అయితే ఈ పెంపు స్వల్పమే. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. పండుగల సీజన్ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు సెప్టెంబరులో వడ్డీరేటును తగ్గించింది. ఇతర బ్యాంకులు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి. తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్‌కు ఖాతాదారుల నుండి మంచి స్పందన లభించినట్లు బ్యాంకు కన్స్యూమార్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ పేర్కొన్నారు. కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ నేపథ్యంలో బ్యాంకు తాజా నిర్ణయం తీసుకున్నది.
ట్వీట్ ఏమిటి
ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ ఇలా ఉంది. 'ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకే ఒక్క ఔషధాన్ని కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులా ఇది భవిష్యత్తు తరానికి సంబంధించిన అంశం. మనం దీనిని పరిష్కరించాలి' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు
Kotak Mahindra Bank - వడ్డీ రేటు ప్రారంభం 6.50% - ప్రాసెసింగ్ ఫుజు 0.50%
- Citibank - వడ్డీ రేటు ప్రారంభం 6.75% ప్రాసెసింగ్ ఫుజు రూ.10,000
- Union Bank of India - వడ్డీ రేటు ప్రారంభం 6.80%
- Bank of Baroda - వడ్డీ రేటు ప్రారంభం 6.75% - ప్రాసెసింగ్ ఫుజు రూ.8,500 - రూ.25,000
- Central Bank of India - వడ్డీ రేటు ప్రారంభం 6.85% - ప్రాసెసింగ్ ఫుజు రూ.20,000
- Bank of India - వడ్డీ రేటు ప్రారంభం 6.85% - Rs. 1,500 - ప్రాసెసింగ్ ఫుజు రూ.20,000
- State Bank of India - వడ్డీ రేటు ప్రారంభం 6.75% - ప్రాసెసింగ్ ఫుజు 0.35%
- HDFC LTD - - వడ్డీ రేటు ప్రారంభం 6.70% - ప్రాసెసింగ్ ఫుజు రూ.3,000 - రూ.5,000(plus taxes)
- ICICI Bank - వడ్డీ రేటు ప్రారంభం 6.90% - ప్రాసెసింగ్ ఫుజు రూ.3,000
- LIC Housing Finance - వడ్డీ రేటు ప్రారంభం 6.90% - ప్రాసెసింగ్ ఫుజు రూ.10,000 -ప్రాసెసింగ్ ఫుజు రూ.15,000
- Axis Bank - వడ్డీ రేటు ప్రారంభం 6.90% - ప్రాసెసింగ్ ఫుజు రూ.10,000


Click it and Unblock the Notifications