Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించి కోటక్ మహీంద్రా బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫానాన్స్
ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో పలు ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు వడ్డీ రేట్లను సవరించాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నవంబర్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా తన FD వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంకు 666 రోజుల ప్రత్యేక కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ వినియోగదారులకు 8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం గరిష్ట వడ్డీ రేటును అందిస్తోంది. రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై, సాధారణ వినియోగదారులు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లు 7.90 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
371 రోజుల నుంచి 665 రోజుల మధ్య కాలపరిమితి గల డిపాజిట్లపై ఈ రేట్లు 7.25 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ చెల్లిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ నవంబర్ 4, 2026 నుంచి కొన్ని నిర్దిష్ట కాలపరిమితులపై తన FD వడ్డీ రేట్లను సవరించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ వినియోగదారులకు గరిష్టంగా 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీని అందిస్తోంది. గతంలో ఈ బ్యాంకు సాధారణ వినియోగదారులకు గరిష్టంగా 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీని అందించేది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కూడా కొన్ని నిర్దిష్ట కాలపరిమితుల కోసం తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. ఇందులో గరిష్టంగా 50 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంపు ఉంది.

ఈ సవరించిన రేట్లు నవంబర్ 4, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల తర్వాత, సీనియర్ సిటిజన్లు 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల FDలపై గరిష్టంగా 7.20 శాతం వడ్డీని పొందవచ్చు. సాధారణ వినియోగదారుల విషయానికి వస్తే 3 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై గరిష్టంగా 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ అక్టోబర్ 29, 2026 నుంచి అమలులోకి వచ్చేలా, ఎంపిక చేసిన కాలపరిమితులపై తన FD వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్ రెండు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ వినియోగదారులకు గరిష్టంగా 6.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఐదు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 7.35 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఇంతకుముందు ఈ బ్యాంక్ సాధారణ వినియోగదారులకు గరిష్టంగా 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ రేట్లను అందించేది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన 444-రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకంపై సాధారణ డిపాజిటర్లకు గరిష్టంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 666 రోజుల డిపాజిట్లపై ఈ బ్యాంక్ సాధారణ వినియోగదారులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందిస్తోంది.
మూడు సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 1,203 రోజుల వరకు కాలపరిమితి గల డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 6.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.85 శాతం వడ్డీని అందిస్తోంది. మెచ్యూరిటీ వ్యవధిని బట్టి, సాధారణ కస్టమర్ల కోసం దీని ఎఫ్డీ రేట్లు 3 శాతం నుంచి 6.60 శాతం వరకు ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 6.85 శాతం వడ్డీని అందించే పరిమిత-కాల పథకం అయిన BOI అక్షయ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ప్రవేశపెట్టింది. 60 నుంచి 80 సంవత్సరాల లోపు వయస్సు గల సీనియర్ సిటిజన్లు 7.35 శాతం ఆఫర్ చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications