Loan: వరుసగా లోన్స్ ఇస్తామంటూ కాల్స్ వస్తున్నాయా..? అయితే మీరు ఇలా చేసారేమో చూస్కోండి..!

CIBIL Score: మనలో చాలా మందికి అంతుచిక్కని విషయం వరుసగా టార్గెట్ చేసినట్లు వరుసగా అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ కావాలా అంటూ కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంటుంది, మన వివరాలు సదరు ఫైనాన్స్ సంస్థలకు ఎవరు అందిస్తుంటారనే అనుమానం మనలో చాలా మందికి వస్తూనే ఉంటుంది. దీనికి సమాధానం కోసం వెతుకుతుంటారు.

వాస్తవానికి చాలా మంది తమ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ఎంత ఉందని చెక్ చేసినప్పుడు ఇటీవలి కాలంలో అనేక లోన్ ఏజెంట్లు, సంస్థల నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సార్ మీరు లోన్ కోసం చూస్తున్నారా అంటూ తక్కువ వడ్డీకే రుణ ఆఫర్లు ఉన్నాయంటూ వారు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితి మీరు కూడా ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇది సర్వసాధారణంగా జరిగే పరిణామమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా కాల్స్ రావటానికి వెనుక అనేక కారణాలు ఉంటాయని వారు చెబుతున్నారు. క్రెడిట్ బ్యూరోలో విచారణ నిర్వహించే కస్టమర్ల డేటాను సాధారణంగా వివిధ బ్యాంకులు యాక్సెస్ చేయగలగటమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Know why people get personal loan enquiries get after Credit Score Checking

కుప్పలు తెప్పలుగా లోన్ ఎంక్వైరీ కాల్స్ రావటానికి కారణాలు..

- ముందుగా క్రెడిట్ బ్యూరో సంస్థలు వ్యక్తులు తమ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నప్పుడు సదరు విషయాన్ని ఆర్థిక సంస్థలతో పంచుకుంటుంటాయి. వ్యక్తులు తమ సిబిల్ రిపోర్ట్ చెక్ చేయటాన్ని సాఫ్ట్ పుల్ అని పిలుస్తుంటారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం కాదు. అయితే ఆర్థిక సంస్థలు మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేయటాన్ని పరిగణలోకి తీసుకుని మీరు ఏదైనా రుణం కోసం లేదా క్రెడిట్ కార్డు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారేమోనని భావిస్తుంటాయి. దీనికి అనుగుణంగా అవి వివిధ కస్టమర్లను అప్రోచ్ అవుతుంటాయి.

- అలాగే కొన్ని క్రెడిట్ బ్యూరో కంపెనీలు తమ వద్ద ఉన్న కస్టమర్ల డేటాను బ్యాంకులు, రుణాలు అందించే ఇతర ఆర్థిక సంస్థలకు విక్రయిస్తుంటాయి. దీని ద్వారా మంచి క్రెడిట్ హిస్టరీ కలిగిన పొటెన్షియల్ కస్టమర్లను ఎంపిక చేసి బ్యాంకులు రుణ అవసరాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు కాల్ చేస్తుంటాయి.

- ఇక రుణాలు కావాలా అని ఫైనాన్స్ కంపెనీలు కాల్ చేయటానికి కారణం వారి వద్ద మంచి కస్టమర్లకు సంబంధించిన గత డేటాను కలిగి ఉండటమే. మీరు ఇంతకు ముందు ఒక ఆర్థిక ఉత్పత్తికి దరఖాస్తు చేయటం లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసినట్లయితే సదరు డేటా ఆధారంగా కూడా ఫైనాన్స్ సంస్థలు కాల్ చేస్తుంటాయి. అలాగే మరికొన్ని రుణ సంస్థలు లేదా బ్యాంకులు ఇప్పటికే వారి వద్ద మీ సేవింగ్స్ లేదా శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే మీకు ముందస్తుగా ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లను అందిస్తుంటాయి. అందువల్ల వాటిని తెలియచేయటానికి కూడా కాల్ చేస్తుంటాయి.

- అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పరిశీలలను నిలిపివేయండి. అలాగే స్పమ్ కాల్స్ బ్రాక్ చేయటం లేదా ఇలాంటి కాల్స్ నుంచి విముక్తి పొందటానికి డునాట్ డిస్టబ్ సేవలను టెలికాం కంపెనీ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+