1Yr Fixed Deposit: దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకుంటుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నప్పటికీ.. భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మాత్రం రేట్లను తగ్గించకపోవటం చాలా మంది పెట్టుబడిదారులను సంతోషానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్ల వద్దే తమ డిపాజిట్లను చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల కోసం వెతుకుతుంటారు. అయితే ఇక్కడ స్వల్ప కాలానికి చేసే బ్యాంక్ డిపాజిట్లపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల జాబితా కోసం వెతుకున్నారు. ఇప్పుడు మనం ఒక-సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 7 బ్యాంకులకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం. 3 ఏళ్లు లేదా ఐదేళ్లపాటు దీర్ఘకాలిక డిపాజిట్లపై బ్యాంకులు అందించే రేట్ల కంటే ఈ రేట్లు తక్కువగా ఉంటాయని మనకు తెలిసిందే.

ఇక్కడ సాధారణ పెట్టుబడిదారులకు ఏడాది కాలానికి చేసే డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో ముందు వరుసలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచింది. ఇది సాధారణ ఇన్వెస్టర్లకు 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా, ఇదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇక ఏడాది కాలానికి అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకుల్లో రెండవ స్థానంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. ఇది సాధారణ పెట్టుబడిదారులకు 6.85 శాతం చెల్లిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం రాబడిని అందిస్తోంది.
ఇక మూడవ స్థానంలో సాధరణ ఇన్వెస్టర్లకు 6.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల జాబితాలో ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఏడాది కాలానికి చేస్తున్న బ్యాంక్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.3 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయని వాటి వెబ్ సైట్ లోని డేటా ప్రకారం వెల్లడైంది. ఇదే క్రమంలో నాలుగో స్థానంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ ఇన్వెస్టర్లకు 6.7 శాతంగా ఉండగా, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక చివరి స్థానంలో నిలిచిన ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పెట్టుబడిదారులకు ఏడాది కాలపరిమితితో ఉండే డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications