High FD Rate: ఎఫ్‌డిపై 9.60 శాతం వడ్డీ ఆఫర్.. ఈ 5 బ్యాంకుల్లో డబ్బులే డబ్బులు..
Fixed Deposits: భారతీయులు సురక్షిత పెట్టుబడులను ఎల్లప్పుడూ ఆదరిస్తుంటాయి. ఇక్కడ తక్కువ వడ్డీ రేటు వచ్చినప్పటికీ అత్యధిక భద్రతను వారు కోరుకుంటుంటారు. ఈ క్రమంలో అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న టాప్ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గతకొంత కాలంగా దేశీయంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతున్న క్రమంలో పెట్టుబడిదారులు తమ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డిల వైపు మళ్లిస్తున్నారు. నిజానికి భారతీయ కస్టమర్లు ఇప్పటికీ తమ పొదుపులను సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఉత్తమ ఎంపికల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పొదుపుచేసిన మెుత్తంపై అత్యధికంగా 9.60 శాతం వరకు రాబడిని పొందేందుకు అవకాశాన్ని కొన్ని బ్యాంకులు ప్రస్తుతం దేశంలో అందిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

1.సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మీరు సమీపకాలంలో ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉత్తమ ఎంపికగా కొనసాగుతోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 9.10% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.60% వడ్డీని 5 ఏళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై ఆఫర్ చేస్తోంది.

2. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇక అధిక రాబడిని అందిస్తున్న జాబితాలో రెండో స్థానంలో నిలిచిన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1001 రోజుల ఎఫ్‌డిపై 9% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.50% వరకు వడ్డీని అందిస్తోంది.

3. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఉత్తమ రాబడులను అందిస్తున్న బ్యాంకుల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1000 రోజుల ఎఫ్‌డిపై 8.51% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.11% వడ్డీని ఇస్తోంది.

4. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: పెట్టుబడిదారులకు ఉత్తమ ఎప్పికల్లో పెట్టుబడికి ఒకటిగా నిలిచిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 888 రోజుల ఎఫ్‌డిపై 8.50% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9% వడ్డీని చెల్లిస్తోంది.

5. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: చివరిగా ఉత్తమ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్‌లకు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎఫ్‌డిపై 8.50 శాతం వడ్డీని అందజేస్తోంది. ఇదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9% వడ్డీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications