సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఇష్టపడేవి ఫిక్స్డ్ డిపాజిట్స్. రిస్క్ లేకుండా ఉండటం, బ్యాంకులు ఇంటికి దగ్గరగా ఉండటం, బ్యాంకు కార్యకలాపాలలో అప్పటికే బాగా పరిచయం ఉండటం కలిసి వచ్చే అంశాలు. పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్‌గా ప్రాచుర్యం పొందాయి. ఇవి అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో ఉంటుంది. ఈ డిపాజిట్స్‌కు 5.40 శాతం నుండి 7.25 శాతం వరకు వడ్డీని ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. ఐటీ చట్టం సెక్షన్ 80సీ మీ పెట్టుబడులపై పన్ను మినహాయింపును అందిస్తుంది. పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడు పెట్టాలనుకుంటే, దేశంలోని వివిధ బ్యాంకులు అందిస్తున్న ప్రస్తుత వడ్డీ రేట్లు పరిశీలించాలి.

కచ్చితమైన రాబడి
సురక్షిత, కచ్చితమైన రాబడిని ఇచ్చే పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ముందు ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా తక్కువగా ఉన్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు తదితర బ్యాంకులు వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాయి.

పన్ను మినహాయింపు
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఫిక్స్డ్ డిపాజిట్ రాబడి పైన పన్ను ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వచ్చే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మీ పెట్టుబడులపై పన్ను మినహాయింపును అందిస్తాయి.
సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్లు సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక. దాదాపు అన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీని అందిస్తాయి.

వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేటు
వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5.40 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 5.75 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.55 శాతం, కెనరా బ్యాంకు 5.75 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.65 శాతం, ఇండియన్ బ్యాంకు 5.75 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 5.95 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 5.75 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 6.30 శాతం, యూనియన్ బ్యాంకు 5.90 శాతం, యాక్సిస్ బ్యాంకు 6.50 శాతం, HDFC బ్యాంకు 5.95 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 5.95 శాతం, ఐడీబీఐ బ్యాంకు 6 శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంకు 6.75 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 7 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 7 శాతం అందిస్తున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications