For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల మధ్య డిఫరెన్స్

|

భారత్‌లో వివిధ ప్రయోజనాల కోసం, ఎంతోమంది కస్టమర్ల కోసం ఆర్బీఐ లైసెన్స్ పొందిన వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి. విభిన్న బ్యాంకులు ఒక నిర్దిష్ట జనాభా సమూహం డిమాండ్లను తీర్చగల ఆర్థిక సంస్థలు ఉన్నాయి. మన దేశంలో వివిధ బ్యాంకుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల మధ్య స్వల్ప తేడా ఉంది. పలు రకాల స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ఉన్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

దేశంలో తక్కువ లేదా బ్యాంకులు లేని ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఇవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా రిజిస్టర్ అవుతాయి. ఇతర కమర్షియల్ బ్యాంకుల వలె ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అన్ని బేసిక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, అంటే రుణాలు తీసుకోవడం, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవచ్చు.

సేవింగ్స్ వెహికిల్స్, చిన్న వ్యాపారాలు, చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు, అసంఘటిత రంగ సంస్థలకు రుణాలు అందించడం ద్వారా ఆర్థిక రంగానికి ఊతమిస్తున్నాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.

వివిధ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

వివిధ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

జనలక్ష్మీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు,

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉన్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు డిపాజిట్ యాక్సెప్టెన్సీ, రుణాల వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు నిర్వహించడానికి అనుమతి ఉంది. చిన్న వ్యాపారాలు, రైతులు, సూక్ష్మ, చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగ సంస్థలు, ఇతర బ్యాంకులు వెళ్లలేనిచోట ఆర్థిక ఊతమిస్తాయి.

పేమెంట్ బ్యాంక్స్

పేమెంట్ బ్యాంక్స్

ఆఫర్ ద్వారా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోత్సహించేందుకు పేమెంట్ బ్యాంకులు స్థాపించబడ్డాయి. మైగ్రేటరీ వర్కర్స్, తక్కువ ఆదాయ కుటుంబాలు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర అసంఘటిత రంగాల ఎంటిటీస్ ఇతరులకు మోడెస్ట్ సేవింగ్స్ అకౌంట్స్, పేమెంట్/రెమిటెన్స్ సేవలు అందించడం ద్వారా ఆర్థిక చేరికను పెంచడం వీటి ఉద్దేశ్యం.

వివిధ పేమెంట్ బ్యాంక్స్... ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఫినో పేమెంట్స్ బ్యాంకు, జియో పేమెంట్స్ బ్యాంకు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు ఉన్నాయి.

English summary

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల మధ్య డిఫరెన్స్ | Know the Difference Between Small Finance Banks and Payments Bank

In India, we come across different types of banks which are licensed by RBI for different purposes and for catering to different customers. Differentiated banks are financial institutions that cater to the demands of a certain demographic group.
Story first published: Friday, July 23, 2021, 19:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X