మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారా? వారి చదువుల కోసం ఇప్పటి నుండి ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) అందించే న్యూ చిల్ట్రన్ మనీ బ్యాక్ ప్లాన్ గురించి తెలుసుకోండి. ఇది సంప్రదాయ మనీ బ్యాక్ ప్లాన్. ఇది పెరుగుతున్న పిల్లలు, వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన సంప్రదాయక మనీ బ్యాక్ ప్లాన్. ఎల్ఐసీ నుండి వచ్చిన మరో అద్భుత పథకం.

పిల్లలకు ఆర్థిక భద్రత
ఎల్ఐసీ న్యూచిల్ట్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ను సున్నా నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం గ్రాండ్ పేరెంట్స్ లేదా పేరెంట్స్ కొనుగోలు చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సహాయపడే బీమా కమ్ పెట్టుబడి పథకం. ప్లాన్ పనితీరు ఆధారంగా ఈ భాగస్వామ్య ప్లాన్ కూడా బోనస్‌కు అర్హమైనది. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ 25 ఏళ్ల వరకు తమ పిల్లల ఆర్థిక భద్రత కోసం అందిస్తుంది.

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ కీలక ఫీచర్స్
- పెరుగుతున్న పిల్లల కోసం ఇది నాన్ లింక్డ్ మనీ బ్యాక్ బ్లాన్.
- ఈ పాలసీ సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, డెత్ బెనిఫిట్ అందిస్తుంది.
- పాలసీకి కనీస వయస్సు సున్నా. గరిష్ట వయస్సు పన్నెండు. మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్ల వరకు. ఈ పాలసీలో చేరిన వయస్సును 25 మైనస్ కూడా మెచ్యూరిటీ వయస్సు (ఉదాహరణకు 25-9=16). పాలసీ గడువు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు.
- మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా వర్తించే విధంగా బోనస్‌తో పాటు ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు బేస్ సమ్ అస్యూర్డ్ పూర్తి మొత్తం అందుతుంది.
- హామీ మొత్తం రూ.1 లక్ష నుండి గరిష్ట పరిమితి.
- ఈ పాలసీని కొనుగోలు చేసినప్పటి నుండి పదిహేను రోజుల్లో రిటర్న్ చేయవచ్చు.

చెల్లింపులు
- ఈ పాలసీలో చేరినవారు వార్షిక, అర్దవార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.
- బీమా చేసినవారు ప్లాన్ ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.
- గ్రేస్ పీరియడ్ 15 రోజుల వరకు ఉంది. ఫ్రీక్వెన్సీ 30 రోజుల వరకు ఉంటుంది.
- బీమా చేసిన వ్యక్తి అనుకోకుండా మృతి చెందితే తదుపరి ప్రీమియంలు రద్దు చేయబడతాయి.
- మూడేళ్ల ప్రీమియంల తర్వాత సరెండర్ చేయవచ్చు. షరతులు వర్తిస్తాయి.
- రెండేళ్లు సక్రమంగా చెల్లించి, ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించని పక్షంలో, చివరి చెల్లింపు అనంతరం గ్రేస్ పీరియడ్ తర్వాత ప్రయోజనాలు నిలిపివేస్తారు.

ఈ పాలసీ బెనిఫిట్స్
ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సర్వైవల్ బెనిఫిట్స్, మెచ్యూరిటీ బెనిఫిట్స్, డెత్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications