Co-Branded credit cards: బెస్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ మీకు తెలుసా?

పార్ట్‌నర్-బ్రాండ్స్ ద్వారా తరుచుగా ట్రాన్సాక్షన్ చేసేవారికి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఎంతో ప్రయోజనం. ఎందుకంటే వారు అదనపు క్యాష్ బ్యాక్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ లేదా డిస్కౌంట్స్‌ను పొందవచ్చు. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ప్రముఖ బ్రాండ్స్ లేదా ప్లాట్‌ఫామ్స్ సహకారంతో ప్రారంభించబడ్డాయి. అదే ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొనుగోళ్లు చేయడంపై కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. అదనపు క్యాష్ బ్యాక్, యాక్సిలరేటరేటెడ్ రివార్డ్ పాయింట్స్ లేదా డైరెక్ట్ డిస్కౌంట్స్‌ను పొందగలిగేలా పేర్కొన్న భాగస్వామ్య బ్రాండ్స్‌తో తరుచుగా ట్రాన్సాక్షన్ చేసే వ్యక్తులకు ఇలాంటి కార్డ్స్ ఉపయోగపడతాయి.

కో-బ్రాండెడ్ కార్డ్స్ కోసం...

కో-బ్రాండెడ్ కార్డ్స్ కోసం...

మీరు కో-బ్రాండెడ్ కార్డ్స్ కోసం చూస్తున్నట్లయితే అయిదు బెస్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌ను పరిశీలించవచ్చు. నిర్దిష్ట కేటగిరీలో మీ ఖర్చు ప్రవర్తన ప్రకారం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఒక నెలలో ఇంధనం, ప్రయాణం లేదా షాపింగ్ కేటగిరీపై గరిష్ట ఖర్చులు చేస్తే కనుక, వీటిపై ప్రయోజనం పొందడానికి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ప్రైమ్ మెంబర్లకు 5 శాతం, అమెజాన్ నాన్-ప్రైమ్ మెంబర్లకు 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్‌లో 100 కంటే ఎక్కువ పార్ట్‌నర్ మర్చంట్స్‌కు చెల్లింపులపై రెండు శాతం క్యాష్ బ్యాక్, ఇతర ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

అమెజాన్ ఇండియాలో షాపింగ్ చేసేటప్పుడు మూడు నుండి ఆరు నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐని అందిస్తుంది. ఇది లైఫ్ టైమ్ ఉచిత క్రెడిట్ కార్డు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు

ఫ్లిప్‌కార్ట్, మింత్రలలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ఉబెర్, క్యూర్ ఫిట్, క్లియర్ ట్రిప్, 1ఎంజీ తదితరాల ద్వారా 4 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఖర్చులపై క్యాష్ బ్యాక్‌తో పాటు కార్డు హోల్డర్లకు నాలుగు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉన్నాయి. భారత్‌లోని భాగస్వామ్య రెస్టారెంట్లలో 20 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ.500.

ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్

ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్‌లో ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్ ద్వారా రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్స్ ఉంటాయి. గ్రాసరీస్, సూపర్ మార్కెట్‌లలో రూ.150 ఖర్చు చేయడం ద్వారా 2 టర్బో పాయింట్స్ వస్తాయి. ఒక టర్బో పాయింట్ అంటే రూ.1 విలువైన పెట్రోల్. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.1000.

బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్

బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్

బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్ వార్షిక ఫీజు చెల్లించడం ద్వారా 6000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. బీపీసీఎల్ ఫ్యూయల్, లూబ్రికేంట్స్ అండ్ భారత్ గ్యాస్ ద్వారా చేసే రూ.100 ఖర్చు పైన 25 రివార్డు పాయింట్స్ వస్తాయి. డైనింగ్, గ్రాసరీ అండ్ మూవీస్, డిపార్టుమెంటల్ స్టోర్స్‌లో రూ.100 ఖర్చు పైన 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. బీపీసీఎల్ ట్రాన్సాక్షన్స్ (రూ.4000 వరకు) పైన 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది. ఖర్చులపై క్యాష్ బ్యాక్‌తో పాటు కార్డు హోల్డర్ నాలుగు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ పొందుతారు. ఒక త్రైమాసికానికి ఒక విజిట్. ఈ క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ.1499.

యాక్సిస్ విస్తారా సిగ్నేచర్

యాక్సిస్ విస్తారా సిగ్నేచర్

యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టిక్కెట్ వోచర్, క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్ ఆఫర్ చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంది. క్రెడిట్ కార్డ్ పైన రూ.200 ఖర్చు చేస్తే 4 సీవీలు వస్తాయి. ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీ రూ.2.5 కోట్లు ఉంది. వార్షిక ఫీజు రూ.3000.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+