క్రెడిట్ కార్డు ఉండటం ఎంత ప్రయోజనకరమో, గడువులోగా బిల్లు చెల్లించకుంటే, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఇష్టారీతిన వినియోగిస్తే అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈఎంఐ చెల్లింపులు ఆలస్యంగా చేస్తే పెనాల్టీ విధించడంతో పాటు ఇది మీ క్రెడిట్ స్కోర్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సంక్లిష్ట సమయంలో మీ క్రెడిట్ స్కోర్ కనుక తగ్గిపోతే దానిని మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేయాలి. మీ బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. బిల్లు చెల్లింపును ఆటోమేటిక్‌గా చేసేందుకు అనుమతించే సేవలను కూడా వినియోగించవచ్చు. అప్పుడు మీరు డెడ్ లైన్‌ను మిస్ కాకుండా ఉండవచ్చు.

సరిద్దుదుకోవాలి
మీ క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే రెగ్యులర్ బేసిస్‌లో రిపోర్ట్ చేయాలి. మీ రికార్డ్స్ అప్ డేట్ సమయంలో సిబిల్ మీ నివేదికలో తప్పుడు సమాచారాన్ని చొప్పించడం లేదా వివరాల రికార్డింగ్‌లో ఆలస్యం చేయడం వంటి పొరపాటు చేయవచ్చు. మీరు చెల్లించిన రుణం మీ క్రెడిట్ స్కోర్‌లో అప్ డేట్ కాలేకపోవచ్చు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అలాంటి పొరపాట్లు కనిపిస్తే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి.

క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం
మంచి క్రెడిట్ స్కోర్ కోసం హోమ్ లోన్, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్రెడిట్ కార్డు రుణాల మిశ్రమం అవసరం. ఎక్కువ అసురక్షిత రుణాలు అననుకూలంగా ఉండవచ్చు. మీ క్రెడిట్ పరిమితి వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అవసరమైతే మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తీసుకోవడం కాదు.. తిరిగి సమయం లోగా చెల్లించే సామర్థ్యాన్ని బేరీజు వేసుకోవాలి. మితిమీరిన అప్పులు కూడా మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతాయి.

అలా కూడా ప్రభావం
కో-సైన్డ్ లేదా హామీ ఇవ్వబడిన లేదా జాయింట్‌గా నిర్వహించే ఖాతాలలో ఆలస్య చెల్లింపులకు సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది. మీ జాయింట్ హోల్డర్ లేదా హామీ ఇవ్వబడిన వ్యక్తి నిర్లక్ష్యం మీకు అవసరమైనప్పుడు యాక్సెస్ చేయగల మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ లేదా లోన్‌లకు గ్యారెంటర్‌గా మారాడన్ని నివారించాలని సిఫార్స్ చేయబడినవి కూడా ఉన్నాయి.

అలా మెరుగుపడుతుంది
క్రెడిట్ కార్డును చాలా తెలివిగా వినియోగించాలి. ఒకేసారి ఎక్కువ అప్పు తీసుకోవాలి. సమయం లోగా చెల్లించాలి. మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉండేందుకు ఒక రుణాన్ని తీసుకోవడానికి ముందు మరో రుణాన్ని చెల్లించాలి. మీరు రుణం తీసుకొని దానిని సమర్థవంతంగా చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.

తక్కువ ఈఎంఐ
లోన్ తీసుకునే సమయంలో మీ ఈఎంఐ పరిమితిని తక్కువగా ఎంచుకొని, సుదీర్ఘ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ఇది మీ క్రెడిట్ పరిమితిని పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. తక్కువ మొత్తం ఈఎంఐగా ఉంటే దానిని క్రమంగా చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ఇది వేగవంతమైన, తక్కువ వడ్డీకి రుణాలను తీసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది.
ఎక్కువ అప్పులు ఉండటం మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీకు అవసరమైతే మాత్రమే మరో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications