For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు ప్రయోజనాలు తెలుసుకోండి.. ఎన్నో లాభాలు

|

క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగిస్తే అంతకుమించిన లాభం లేదు. బిల్లింగ్ సైకిల్ సహా అన్నింటిపై అవగాహనను కలిగి ఉంటే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు అసంఖ్యాకం. చేతిలో డబ్బులు లేకుంటే క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. అవసరమైన పక్షంలో పరిమిత నగదు ఉపసంహరణపై వడ్డీ ఉండదు. అపరిమిత రివార్డ్ పాయింట్స్ ప్రయోజనం ఉంటుంది. ఇన్సురెన్స్ కవరేజీ ఉంటుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్ వస్తాయి. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకుంటే రుణాలు, వడ్డీపై లాభం ఉంటుంది.

క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు

క్రెడిట్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు

మంచి వేతన ప్యాకేజీతో ఉద్యోగంలో చేరితే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆటోమేటిక్‌గా అర్హులు అవుతారు. అయితే పదేపదే రుణాలు తీసుకుంటే ఆర్థికంగా దెబ్బ పడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆయా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డుకు పరిమితి ఉంటుంది. ఆ పరిమితి లోపు మీరు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ఇది మీ నెలవారీ బడ్జెట్ పైన ప్రభావం చూపకపోవచ్చు! కానీ ముందు లేదా ఆ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. లేదా కొనుగోళ్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో నగదు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఇది అత్యంత ఆమోదయోగ్య చెల్లింపు పద్ధతి.

క్రెడిట్ కార్డు ద్వారా 45 రోజుల నుండి 50 రోజుల పరిమితి వడ్డీ రహితంగా ఉంటుంది. పరిమిత మొత్తంలో డబ్బును కూడా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక అత్యవసర సమయాల్లో దీనిని ఉపయోగించవచ్చు.

డిస్కౌంట్‌ను ఆనందించవచ్చు

డిస్కౌంట్‌ను ఆనందించవచ్చు

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడల్లా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే, వీటిని సులభంగా రిడీమ్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డు ద్వారా పర్సనల్ యాక్సిడెంట్ యావరేజ్, కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సురెన్స్ కవరేజీని పొందుతారు. క్రెడిట్ కార్డ్స్ ముఖ్య ప్రయోజనాల్లో ఇవి కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్, ట్రావెల్ కార్ట్స్.. ఇలా మనం ఏది ఎక్కువగా ఉపయోగిస్తే ఆ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. వివిధ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం ద్వారా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, చెక్-ఇన్ ప్రాధాన్యతలు ఉంటాయి. అలాహే రెస్టారెంట్లలోను డిస్కౌంట్‌ను ఆనందించవచ్చు.

క్రెడిట్ స్కోర్ మెరుగుపరచడానికి

క్రెడిట్ స్కోర్ మెరుగుపరచడానికి

సినిమా టిక్కెట్స్, ఆన్ లైన్ షాపింగ్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్ ఔట్ లెట్స్‌పై తగ్గింపు వర్తిస్తాయి. మీరు దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఇంధన సర్‌ఛార్జీ మినహాయింపులు ఆస్వాదించవచ్చు. క్రెడిట్ కార్డు ప్రయోజనాలు క్రెడిట్ పైన షాపింగ్ చేయడానికి మాత్రమే పరిమితం కావు. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించాలో, క్రెడిట్ కార్డు వ్యవధిని ఎలా ఉపయోగించాలో, ఉపయోగించిన మొత్తాన్ని సకాలంలో ఎలా చెల్లించాలో మీకు తెలిస్తే మీరు మీ సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలను పొందడంలో మీకు సహాయం చేస్తుంది.

English summary

క్రెడిట్ కార్డు ప్రయోజనాలు తెలుసుకోండి.. ఎన్నో లాభాలు | Know the benefits of using a Credit Card

The benefits of credit cards are innumerable, and some prime ones are.Buy on credit, Most accepted method of payment, Interest free cash withdrawals,Unlimited reward points, Insurance coverage,Make travel easy, Discounts and cashbacks,Improve your credit score.
Story first published: Friday, March 18, 2022, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X