భారతీయులు ఎక్కువగా తమ సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉంచేందుకు ఇష్టపడుతుంటారు. దీనివల్ల రాబడి రూపంలో కొంత నష్టం ఉన్నప్పటికీ.. అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
అకస్మాత్తుగా డబ్బు అవసరమైన సమయంలో వెంటనే డబ్బును తిరిగి పొందటానికి బ్యాంక్ డిపాజిట్లలో ఉంచిన సొమ్ము సహాయపడుతుంది. డిపాజిట్ వేసిన గడువు కంటే ముందర డబ్బును తీసుకున్నట్లయితే సాధారణంగా బ్యాంకులు కొంత మెుత్తాన్ని పెనాల్టీగా వసూలు చేస్తుంటాయి. అయితే ఇది తక్కువగానే ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లేదా ఇతర మార్గాలను పెద్దగా భారతీయులు ఎంచుకోరని వెల్లడైంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి బ్యాంకు వద్ద లక్ష రూపాయలు రెండు సంవత్సరాల కాలానికి 8 శాతం వడ్డీకి డిపాజిట్ చేశాడని అనుకుందాం. ఒకవేళ అనుకోని ఖర్చుల కారణంగా ఏడాది తర్వాత డిపాజిట్ గడువు ముగియకుండానే దానిని విత్ డ్రా చేసుకున్నట్లయితే బ్యాంకులు 2 శాతం పెనాల్టీ మెుత్తాన్ని మినహాయించి మిగిలిన 6 శాతాన్ని వడ్డీ రూపంలో చెల్లిస్తాయి.
అయితే ఇటీవల రిజర్వు బ్యాంక్ ఈ ధోరణికి చరమగీతం పాడింది. అక్టోబర్ 26, 2023 నుంచి పెట్టుబడిదారులు తమ డిపాజిట్ల విషయంలో ప్రీమెచూర్ విత్ డ్రా చేసినట్లతే వాటిపై పెనాల్టీ విధించవద్దని పేర్కొంది. ఇది నిజంగా పెద్ద శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఈ నిబంధనను కోటి రూపాయల లోపు ఉండే అన్ని కాలాలకు చేసే బ్యాంక్ డిపాజిట్ల విషయంలో అమలు చేయాలని దేశంలోని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రెండేళ్ల కాలానికి 8 శాతం వడ్డీతో డిపాజిట్ చేస్తే దానిని ఏడాది ముందే ఉపసంహరించుకుంటే ఈ సందర్భంలో ఏడాది డిపాజిట్లకు అందించే వడ్డీ చెల్లించాలని అదనంగా పెనాల్టీలు వసూలు చేయరాదని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications