Investment: పిల్లల భవిష్యత్తు కోసం 4 పెట్టుబడి చిట్కాలు..!
Investment Ideas: చాలా మందికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన ఉంటుంది. జాగ్రత్త కలిగిన వ్యక్తులు మాత్రం ఈ విషయాలను పిల్లలు పుట్టిన వెంటనే ప్రారంభిస్తారు. అయితే చాలా మందికి ఎలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో మాత్రం తెలియదు. అలాంటి వారికోసమే ఈ వార్త..
పిల్లల పెట్టుబడి అవసరాల కోసం ప్రభుత్వ పథకాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు ఎంపికలు ఉన్నాయి. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, MD రాధికా గుప్తా పిల్లల కోసం పెట్టుబడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చిట్కాలను అందించారు. దీన్ని అనుసరించడం ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును కూడా సురక్షితంగా ఉంచగలరు.

1. ముందుగా మీ పిల్లలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వారికి సంబంధించిన జనన ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ తయారు సిద్ధం చేసుకోవాలి. దీనికి తోడు పిల్లల బ్యాంక్ ఖాతాను కూడా తెరవండి.
2. పిల్లల కోసం పెట్టుబడి పెట్టే ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మీరు ఏ ప్రయోజనం కోసం పెట్టుబడి పెట్టాలో ఆ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. దీని ప్రకారం పెట్టుబడి మొత్తంతో పాటు అందుకోసం అవసరమైన వ్యవధిని నిర్ణయించండి. ఉదాహరణకు.. పిల్లల ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెట్టాలి. అటువంటి పరిస్థితిలో పిల్లల చదువుకు అనుగుణంగా పెట్టుబడి వ్యవధి, మొత్తాన్ని నిర్ణయించవలసి ఉంటుంది.
3. పిల్లల భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి ఎంపికల్లో మెరుగైనది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP). బలమైన రాబడి కోసం కొన్ని ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా ఇంటర్నేషనల్ ఫండ్స్ వంటి ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి.
4. తల్లిదండ్రులు తమ పిల్లల పెరుగుతున్న కొద్దీ.. నిర్దేశిత లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఉత్తమం. మీరు లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ దాన్ని మరింత పటిష్టం చేసుకోండి. పెట్టుబడులు మొదలైన వాటి గురించి పిల్లలకు అవగాహన కల్పించి, వారిని సైతం సురక్షితమైన పెట్టుబడి ఎంపికలవైపు ప్రేరేపించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications