Post Office RD: దేశంలో ఎన్ని పెట్టుబడి సాధనాలు పుట్టినా ఇప్పటికీ ప్రజల నుంచి భారీగా ఆదరణ పొందుతున్నాయి పోస్టాఫీసు పథకాలు. అయితే ఈ క్రమంలో ఎలా పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అన్న విషయాలు మాత్రం మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ.. పోస్టల్ పథకాల్లో మాత్రం నమ్మకాన్ని కోల్పోవటం లేదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ.17 లక్షలు ఎలా పొందాలన్న విషయం గురించే. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇతర పథకాల మాదిరిగానే సురక్షితమైనది, ప్రభుత్వ హామీని కలిగి ఉన్నది. కొద్దిగా రాబడి తక్కువగా వచ్చినప్పటికీ ఎక్కువ రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లకు ఇది అద్భుతమైన ఎంపిక. అయితే స్కీమ్ కింద నెలవారీ వాయిదా చెల్లింపులు క్రమం తప్పకుండా సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా సకాలంలో చెల్లించకపోతే 1 శాతం జరిమానా కూడా విధించబడుతుంది.వరుసగా 4 వాయిదాలు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా ఆర్డీ మూసివేయబడుతుంది.

పోస్టల్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లుగా ఉంది. అందువల్ల వరుసగా ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వడ్డీతో పాటు అసలు తిరిగి చెల్లించబడుతుంది. ఎవరైనా వ్యక్తులు ఈ స్కీమ్ కింద కనీస పెట్టుబడి మెుత్తం రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకోసం ఖాతా తెరిచేందుకు ముందుగా సమీపంలోని పోస్టాఫీసులను సంప్రదించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ చిన్న పొదుపు పథకానికి 6.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
పోస్టల్ రికరింగ్ డిపాజిట్ ద్వారా రూ.17 లక్షలు సంపాదించటం ఎలా అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇందుకోసం పొదుపు ప్రారంభించే వ్యక్తులు నెలకు కనీసం రూ.10,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు సగటున రూ.333 పెట్టాలన్నమాట. ఇక్కడ ఐదేళ్ల పెట్టబడిపై వడ్డీ రాబడితో కలిపితే మెుత్తం రూ.7,17,827 మెచ్యూరితీ మెుత్తం అందుకుంటారు. ఇప్పుడు దీనిని రూ.17 లక్షలుగా మార్చాలంటే.. పెట్టుబడిని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 10 ఏళ్లలో పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ రూ.5,18,546తో కలిపితే మెచ్యూరిటీ సొమ్ము రూ.17,18,546గా మారుతుంది. ఇలా స్థిరమైన రాబడిని కోరుకునే వ్యక్తులు రిస్క్ లేకుండానే చిన్న మెుత్తాలను కూడబెడుతూ లక్షలు అందుకునేందుకు వీలు ఉంటుంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications