Credit Card: ఆదాయ రుజువు లేదా..?? అయినా క్రెడిట్ కార్డు పొందండిలా..!!
Credit Card: ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల వినియోగానికి క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ రిపోర్టుల ప్రకారం ఇండియాలో క్రెడిట్ వినియోగం గతంలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయిలకు పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. క్రెడిట్ కార్డు వినియోగం గురించి పరిశీలిస్తే..
క్రెడిట్ కార్డును మెరుగ్గా ఉపయోగించడం వల్ల ఖర్చులను సక్రమంగా నిర్వహించుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ పొందడానికి.. బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలకు చాలా రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా మంది క్రెడిట్ కార్డును పొందటం వీలుకాదు. దరఖాస్తుకు ఆదాయ రుజువు(Income Source) అత్యంత ముఖ్యమైన పత్రం. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి ఆదాయ పత్రాన్ని అందించ కుండా క్రెడిట్ కార్డులను ఎలా పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా సంస్థ కార్డ్ జారీ చేసే ముందు.. క్రెడిట్ కార్డ్ జారీ చేయబడే వారికి నెలవారీ ఆదాయ పరిమితిని బ్యాంక్ నిర్దేశిస్తుంది. మీరు ఉద్యోగిగా ఉంటూ.. మీ ఆదాయం బ్యాంక్ నిర్ణయించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే.. సులువుగా క్రెడిట్ కార్డును పొందుతారు. తప్పనిసరిగా బ్యాంకులు దీనిని కార్డు జారీ కోసం అసెస్‌మెంట్ చేస్తాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో లేదో తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం.
ఒక వ్యక్తికి ఆదాయ రుజువు లేకపోతే, అలాంటి పరిస్థితిలో కూడా వారు క్రెడిట్ కార్డును పొందగలరని డిబిఎస్ బ్యాంక్‌కు చెందిన సాజిస్ పిళ్లై వెల్లడించారు. ఆదాయ రుజువు లేనట్లయితే.. క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకు వ్యక్తి తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఇతర ఎంపికలను పరిశీలిస్తుందని వెల్లడించారు. దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోర్, క్రెడిట్ బ్యూరో నుంచి చెల్లింపుల హిస్టరీ, సదరు వ్యక్తికి ఉన్న ఆస్తులను కూడా పరిగణిస్తాయి. ఒక కస్టమర్ క్రెడిట్ బ్యూరో ద్వారా ధృవీకరించబడి, ఇతర కార్డ్‌లు లేదా అప్పులను తిరిగి చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నట్లయితే బ్యాంకులు వారికి క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయని పిళ్లై స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications