Pension Planning: రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా..?? పూర్తి వివరాలు
Monthly Pension: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ తక్కువ మెుత్తం పెట్టుబడులతో మంచి రిటర్న్స్ పొందుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేంద్ర ప్రభుత్వ పథకం అటల్ పెన్షన్ యోజన గురించే. దీని ద్వారా ప్రతినెల రూ.5,000 కచ్చితమైన ఆదాయాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మీరు రోజుకు ఒక కప్పు టీ కంటే తక్కువ మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయస్సులోనే ప్లానింగ్ చేస్తున్నట్లయితే దీనిని కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ తర్వాత దీని ఫలితాలను పెట్టుబడిదారు అందుకుంటారు.

అదే మీరు కొంత ఆలస్యంగా 25వ ఏట అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించినట్లయితే కొంత ఎక్కువగా నెలకు రూ.367 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 35వ ఏట దీనిని ప్రారంభించాలనుకుంటే అందుకోసం నెలకు రూ.902 పెట్టుబడిగా పెట్టాలన్నమాట. దీంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఇతర ఆదాయ మార్గాలకు తోడుగా ప్రతినెల రూ.5,000 పెన్షన్ రూపంలో పొందగలుగుతారు.
ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా తమ నెలవారీ పెన్షన్ ప్లానింగ్ చిన్న వయస్సులోనే ప్రారంభించటం ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతోనే తమ గోల్స్ చేరుకోవచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. ఇది కార్మికులు, ఆర్థికంగా బలహీన వ్యక్తుల కోసం రూపొందించిన నెలవారీ పెన్షన్ పథకం. వెంటనే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని సద్వినియోగం చేసుకోండి.


Click it and Unblock the Notifications